వైసీపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిపోయిందని టీడీపీ సీనియర్ నేత  కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. కాపురిజర్వేషన్ల రద్దు, పోలవరం టెండర్ల రద్దు, పీపీఏ లు రద్దు, బందర్‌పోర్డు ఒప్పదం రద్దు, అన్నక్యాంటీన్లు రద్దు...  ఇలా గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను  జగన్‌ ప్రభుత్వం రద్దు చేస్తూ రద్దుల ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని ఆయన  మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే  వైసీపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగుల్ని తొలగించి వైసీపీ కార్యకర్తల్ని నియమించే కార్యక్రమం చేపట్టిందని అన్నారు.


 రెండు నెలల వైసీపీ పాలన రద్దుల ప్రభుత్వంగా ముద్రపడిందన్న ఆయన ,  టీడీపీ ప్రభుత్వ  హయాంలో ఇసుకలో అక్రమాలు చోటుచేసుకున్నాయని దుష్ప్రచారం చేసిన వైసీపీ నేతలు... ఈరోజు ఇసుకలో  వాటలు వేసుకుని  పంచుకుతింటున్నారని ఆరోపించారు . గత ప్రభుత్వంలో ఇసుక రూ.1500లకు దొరికితే, వైసీపీ రెండు నెలల కాలంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.6,500లకు చేరిందన్నారు. ప్రస్తుతం సిమెంట్‌ ధర కంటే బస్తా ఇసుక ధర అధికంగా ఉందని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఇసుక అందుబాటులో లేని కారణంగా రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది కార్మికులు పూటగడవ అవస్థలు పడుతున్నారని చెప్పారు .


జగనన్న వస్తాడు మీ కష్టాలు తీర్చుస్తాడని  వైసీపీ నాయకులు పదే పదే ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన అనంతరం ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఎద్దేవా చేశారు. కేత్రస్థాయిలో పని చేసే అంగన్‌వాడీలు, ఆశావర్కర్లను, ఉపాధి హామీ ఫిల్డ్‌ ఆసిస్టెంటులను ఏకపక్షంగా రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు . ఈ రాష్ట్రంలో దాదాపు ఒప్పంద కార్మికులకు అర్హతను బట్టి ఏళ్లతరబడి ప్రజలకు కేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారని, అటువంటి వారిపై ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోవడం బాధాకరమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: