సెప్టెంబర్ 17.. తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తేదీ. దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్ట్ 15న వచ్చినా.. తెలంగాణకు మాత్రం రాలేదు. తెలంగాణ అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంతో పాటు జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాల్లో స్వేచ్ఛావాయువులు లేవు.. తెలంగాణ నిజాం ఏలుబడిలో ఉంది. ఆనాటి నిజాం ఏలుబడి అరాచక చరిత్ర.


నిజాం రాజు.. భూస్వాములు, దొరలు, రజాకార్లు.. ముప్పేట దాడితో తెలంగాణ జనం నలిగిపోయారు. అలాంటి చరిత్రలో ఓ భాగం బైరాన్‌పల్లి నెత్తుటి గాథ. ఈ గ్రామంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైందిబైరాన్‌పల్లిలో ఆరోజు ఏం జరిగింది..?


రజాకార్లు, పోలీసులు..నిజాం సైన్యం సాయంతో 12 వందల మంది దాడికి దిగారు. ఊళ్లో జనమంతా గ్రామ బురుజుపైకి వెళ్లి తలదాచుకున్నారు. వారికి రక్షణగా గ్రామరక్షక దళాలు నిలిచా యి. బురుజుపై నుంచి రజాకార్లపైకి కాల్పులు జరిపాయి. 1948 ఆగస్టు 27న వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 12వందల మంది బలగంతో భారీ మందు గుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామపొలిమేర్లకు చేరుకున్నారు.


ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలను ఆడించారు. ఈ దాడులలో ఈ దాడులలో 118మంది అమాయకులు బలికాగా 25మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డులలో ఉంది.

se

మరింత సమాచారం తెలుసుకోండి: