హైదరాబాద్: మరి కొందరు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదనీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్ల తాము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎప్పుడయితే అనర్హతకు గురయ్యారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు. కేవలం సానుభూతితోనే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలిచారన్నారు. కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లి గెలిచారన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరెవరూ బయటకు వెళ్లరనీ అన్నారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదనీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: