గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల  చంద్రబాబు పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదటి సారి రాజధాని అమరావతి లో పర్యటన చేశారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అటు  చంద్రబాబు పర్యటన గురించి సమాచారం తెలుసుకున్న అమరావతి రైతులు చంద్రబాబు ను అమరావతి లోకి అడుగు పెట్టడంతో నిరసనలు తెలిపారు . చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే చంద్రబాబు పర్యటన ప్రారంభంలోనే చంద్రబాబు కాన్వాయ్ పై రైతులు చెప్పులు, కర్రలు  విసరడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన విషయం తెలుస్తుంది. 

 


 కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన తెలుసుకున్న విద్యార్థి సంఘం నేతలు చంద్రబాబు గోబ్యాక్ అంటూ నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు జిల్లాలో తాజాగా రాయలసీమ విద్యార్థి జేఏసీ  చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కర్నూల్ లోని విజేఆర్ ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కర్నూలు జిల్లాకు ఏం చేశారని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలదీస్తాయి రాయలసీమ విద్యార్థి జేఏసీ . అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు . పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.

 


 చంద్రబాబుకు ఇటీవలి అమరావతి పర్యటనలో అడుగడుగునా నిరసనలు తగినట్లుగానే కర్నూలు జిల్లాలో కూడా నిరసన సెగలు తగులుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన  ఇంకెన్ని ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందోనని  భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాయలసీమ విద్యార్ధి జేఏసీ  నిరసన తెలుపుతుండగా ... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా అలెర్ట్ గా  ఉన్నారు. అయితే ఎన్ని నిరసనలు ఎదురైనప్పటికీ చంద్రబాబు మాత్రం కడప జిల్లా పర్యటనకు ముందుకు సాగుతూనే ఉన్నారు. కాగా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో సమావేశమై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను తెలుసుకోవడానికి చంద్రబాబు పర్యటన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: