జనసేన బీజేపీ పార్టీలు ఇప్పుడు ఏకమయ్యాయి. ఈ రెండు పార్టీల కలిసి వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారి అధికారం చేజిక్కించుకోవాలని కళలు కంటున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కలిసి మెలసి ప్రజా పోరాటాలు చేప్పట్టేందుకు కూడా ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు బీజేపీలో పవన్ కు అన్యాయం జరిగిపోతుంది అంటూ పవన్ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.పవన్ కు బీజేపీ తాము ఊహించినంత స్థాయిలో పవన్ కు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వలేదంటూ గగ్గోలు పెడుతున్నారు జనసైనికులు. పవన్ ఢిల్లీ పర్యటనలోనూ, విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ విషయం బయటపడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


అసలు బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడమే పెద్ద ఆశ్చర్యంగా అందరూ భావిస్తుండగా, పొత్తు పెట్టుకున్న కొద్ది రోజులకే ఈ విధంగా పవన్ కు అవమానం జరిగిందంటూ ఆందోళన రేగడం సంచలనం రేపుతోంది.ఏపీలో బీజేపీకి కేవలం 1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.జనసేన పార్టీకి బీజేపీ కంటే కనీసం 400 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి. అటువంటి బీజీపీ తో జనసేన పొత్తు పెట్టుకోవడం చాలామంది జనసైనికులకు రుచించడంలేదు. ఇక పవన్ ఢిల్లీ కి పొత్తు పెట్టుకునేందుకు వెళ్లగా అక్కడ ఆయనకు జేపీ నడ్డా దర్శనం మాత్రమే దక్కింది. కానీ అమిత్ షా, మోదీ దర్శనం మాత్రం దక్కలేదు. అయితే పవన్ వారిని కలవలేదని జనసేన సర్ది చెప్పుకుంటోంది. ఇక పొత్తుపై బీజేపీ పెద్దలు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. 


సుజనా చౌదరి, సీఎం రమేష్, మిగతా ఎంపీలు జేపీ నడ్డాను కలిసినప్పుడు ఆ నలుగురు స్వయానా జేపీ నడ్డాను తీసుకెళ్లి ఉప రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లి ఆయనతో మాట్లాడించి అందరూ కలిసి బీజేపీ అఖిల భారత కార్యాలయానికి వెళ్లి అక్కడ జేపీ నడ్డా, సుజనా చౌదరి అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన బీజేపీ ఎంపీలకంటే పవన్ స్థాయి ఎక్కవ అయినా పవన్ ను బీజేపీ పెద్దగా పట్టించుకోకపోవడం ఏంటి అనేది జనసైనికుల ఆవేదన. 


జనసైనికుల బాధ ఇలా ఉంటే .. మరికొందరు మాత్రం పవన్ ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడప స్టీల్ ప్లాంట్ ఇలా అనేక విషయాల్లో బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని, అప్పుడు పవన్ గట్టిగా పోరాటం చేశారు కదా ఇప్పుడు అదే బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గట్టిగా బీజేపీని నిలదీయాలని మరికొందరు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: