ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలను విస్మరిస్తే సమస్యలు తప్పవని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ విషయం తెలిస్తే సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అమరావతి రాజధానిగా కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమాలు మరలా వచ్చేవని ధర్మాన స్పష్టం చేశారు.                                      
 
మరలా ఉద్యమాలు వస్తే మనం అందరం కలిసి ఉండే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేస్తోందని వెనుక నుండి తమను అడ్డుకుంటున్నారని ధర్మాన చెప్పారు. జగన్ ధైర్యంగా మూడు రాజధానుల గురించి నిర్ణయం తీసుకున్నాడని జగన్ తీసుకున్న నిర్ణయం వలనే తమ ప్రాంతాలలో వెలుగులు వచ్చాయని చెప్పారు. 
 
చంద్రబాబు రాజధాని అమరావతిని పూర్తిగా వ్యాపార ధోరణితో మాత్రమే చూశారని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించే విధంగా రాజధాని నిర్మాణం ఉండాలని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. గత ప్రభుత్వం ఎవరితో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుందని ధర్మాన విమర్శించారు. 
 
గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శివరామకృష్ణ కమిటీ పర్యటన పూర్తి కాక మునుపే రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టుపై గౌరవం లేదని ధర్మాన అన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా శివరామకృష్ణన్ చేసిన సూచనలనే పాటిస్తున్నారని ధర్మాన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను విశాఖ మారుమూల ప్రాంతమా అంటూ ధర్మాన నిలధీశారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబును ధర్మాన అసెంబ్లీ సమావేశాల్లో కడిగి పడేశారని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: