కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మ పురస్కారానికి మొత్తం 141 మందిని ఎంపిక చేయగా 118 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఐదుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ నుండి పీవీ సింధు, చింతల వెంకట రెడ్డి, విజయసారథి శ్రీ భాష్యం ఎంపిక కాగా దాలవాయి చలపతి రావ్, యడ్ల గోపాల్ రావ్ ఆంధ్రప్రదేశ్ నుండి పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. 
 
ఈ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పర్యావరణవేత్త సుందరం వర్మ కూడా ఒకరు. భారత ప్రభుత్వం సుందరం వర్మ 50,000 చెట్లను పెంచినందుకు సుందరం వర్మకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని శుష్క షెకావత్ ప్రాంతంలో సుందరం వర్మ 50,000 చెట్లను పెంచాడు. డ్రైలాండ్ అగ్రోఫారెస్ట్రీ అనే సరికొత్త విధానం ద్వారా సుందరం వర్మ చెట్లను పెంచాడు. 
 
ఒక లీటర్ నీటిని ఒక చెట్టుకు ఉపయోగించి తక్కువ నీటితో ఎక్కువ చెట్లు పెరిగేలా చేశారు సుందరం వర్మ. భూమిని సమంగా చేసి కలుపు మొక్కలను తొలగించి వర్షపు నీటిని ఇంకిపోకుండా చేసి పొలాన్ని అనేక సార్లు దున్నిన తరువాత లోతైన గుంటలు తీసి మొక్కలను నాటేవారు. ఒక లీటరు నీటిని మాత్రమే గుంటలో పోసి మొక్కలు పెరిగేలా చేసేవారు. 
 
తనకు మొక్కలను పెంచటం అంటే ఎంతో ఇష్టమని చెబుతున్న సుందరం వర్మ పద్మ శ్రీ పురస్కారం లభించటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం నా పనితీరును మరింతగా మెరుగుపరుస్తుందని సుందరం వర్మ చెప్పారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఏడుగురు పద్మ విభూషణ్ కు 16 మంది పద్మ భూషణ్ కు ఎంపికయ్యారు. పద్మ పురస్కారానికి ఎంపికైన వారిలో 12 మంది చనిపోయిన తరువాత పురస్కారాన్ని దక్కించుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: