జగన్ సర్కారు మహిళల కోసం ఎన్నో పథకాలు రూపొందిస్తోంది. ఆర్థికంగా , సామాజికంగా ఆదుకోవడమే కాదు.. సమాజంలో మహిళలకు భద్రత కోసం జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పక్క రాష్ట్రంలో దిశ వంటి ఘోరమైన ఘటన జరిగింది. ఆ స్ఫూర్తితో మహిళల రక్షణ కోసం ఆయన ఏకంగా దిశ చట్టమే తీసుకొస్తున్నారు. మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.



అంతేనా.. ఒక సమాజం అభివృద్ధికి మహిళల అక్షరాస్యత, మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, మహిళలు నిర్భయంగా సంచరించడం వంటివి ప్రామాణికాలని జగన్ నమ్ముతున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రకాల అవకాశాలు ఉండాలనే తపనతో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.



అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరక్కమునుపే 42 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా మేలు చేశారు. ఈ ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల చేతుల్లో పెట్టి.. వారి పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నారు. మహిళల్లో ఆనందం నింపేలా మద్యాన్ని నియంత్రించే కార్యక్రమం చేస్తున్నారు. మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్‌ క్రియేట్‌ చేసి నామినేటెడ్‌ పదవి, పనుల్లో ప్రతి అంశంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉండాలని ఏకంగా చట్టాన్ని తెచ్చారు.



జగన్ మహిళల కోసం ఇంతగా ఆలోచించడానికి కారణం ఆయన కుటుంబమే. మహిళలు ఎందులోనూ తీసిపోరని జగన్ అంతగా నమ్మడానికి ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, భార్య భారతి కళ్ల ముందే కదులుతున్నారు. అంతే కాదు.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారు ఉన్నత చదువులు చదువుతున్నారు. అందుకే అలాంటి ఓ కుటుంబం సభ్యుడిగా.. ఒక అన్నగా, కొడుకుగా జగన్ ఆలోచిస్తున్నారు. చివరకు రాష్ట్రంలోని మహిళల పిల్లలకు మంచి మేనమామగా ఆలోచన చేశానని ఆయనే చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: