ఈ రోజుల్లో  ఎక్కడ పడితే అక్కడ దొంగల బెడద మరీ ఎక్కువ అయిపోతుంది. ఉద్యోగం చేస్తే నెల  రోజులకు  జీతం వస్తుంది... దొంగతనం చేస్తే భారీగా ఒకేసారి డబ్బును కాచేయొచ్చు... విలాసంగా బతకొచ్చు అనే ఆలోచనతో ఎక్కువ మంది దొంగలు గా మారిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే కాదండోయ్ అన్ని దేశాల్లో దొంగల బెడద రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇక దొంగల బెడద నుంచి ప్రజలను కాపాడడం పోలీసులకు సవాల్గా మారుతోంది. అయితే మామూలుగా అయితే దొంగలు ఎవరైనా చూస్తే ముందు భయపడతారు ఆ తర్వాత ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఓ యువకుడు దొంగతనం చేసి పారిపోతున్న దొంగను సమయస్ఫూర్తితో ఎంతో తెలివిగా పోలీసులకు పట్టించాడు. 

 


 ఇక యువకుడు సరైన సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించడాన్ని పోలీసులు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఆ దొంగ ఏం చేసాడు... ఆ యువకుడు సమయస్ఫూర్తితో ఆ దొంగను పోలీసులు ఎలా పట్టించాడు అనేది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. జార్జియాలో ఓ దొంగ... ఓ మాల్ లో చోరీకి పాల్పడ్డాడు. చోరి చేసిన అనంతరం ఎవరికీ చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇక పోలీసులను  చూసిన దొంగ మెల్లగా పరుగు ప్రారంభించాడు... పోలీసు ఆగు అని బెదిరించడం తో వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టాడు. అదే సమయంలో అటుగా మాల్ నుంచి సామాన్లు కొనుక్కుని.. కార్ డిక్కీలో వాటిని పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు సామాన్లను గ్రోసరీ కార్డ్ లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు.ఈ క్రమంలోనే తమ వైపు ఆ దొంగ పరిగెడుతూ వస్తుండడం చూసిన ఓ యువకుడు... తెలివిగా తమ సామాన్యులు కార్డు ను  దొంగ వైపు జారవిడిచాడు. ఇక వెనక వస్తున్న పోలీసును  చూసిన దొంగ ముందు ఆ యువకుడు జారవిడిచిన కార్డును చూడలేదు.

 


 దీంతో దానికి  తగిలి ఒక్కసారిగా కింద పడడంతో వెంటనే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. సరైనా సమయంలో  సమయస్ఫూర్తిని ప్రదర్శించి అతి తెలివిగా దొంగను పట్టించిన యువకుని అభినందించారు పోలీసులు. ఈరోజు ఫుటేజ్ ని ప్రస్తుతం సోషల్ మీడియాలో పోలీసులు విడుదల చేయగా... ఆ యువకుని సమయ స్ఫూర్తి పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఆ యువకుడిలా అందరూ తమకు దొంగలను పట్టుకోవడానికి సాయం చేయాలని కోరడం లేదు అంటూ తెలిపిన పోలీసులు.. ఆ యువకుడు వల్లే ఆ దొంగను పట్టుకున్నాము అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: