ఉపఎన్నికల్లో విజయదుందుబి మోగించి ఊపు మీదున్న వైఎస్ఆర్ పార్టీ వైపు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతల చూపు పడింది. బరిలోనిలిచి ఓటమిభారం చవి చూసేకన్నా జగన్ తో జట్టు కట్టేందుకు ఇరు పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. వలసలను నివారించుకునేందుకు నారా, నల్లారీలు కోవర్టు వ్యవస్థను నడిపిస్తున్నారు. పార్టీలో జంప్ జిలానీలను కట్టడి చేసేందుకు తాయిలాలు తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో రెండేళ్ళ పాటు అధికారం కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి, 2014లో అధికారం అందుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర యత్నాలు సాగిస్తున్నారు.
ఎప్పటికప్పుడు యువనేత జగన్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టిసారించారు. వైఎస్ఆర్ పార్టీ గొడలకు చెవులు ఆనించి అక్కడి విషయాలు తెలుసుకుంటున్నారు. పార్టీలో వలసలను నివారించేందుకు నల్లారి, నారాలు పాట్లు పడుతున్నారు. టిడిపి నుంచి మంత్రాలయం ఎమ్మేల్యే బాలనాగిరెడ్డి, కొడాలి నాని, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తదితరులు పార్టీ విడేందుకు సుముఖత చూపుతున్నారు.
కాగా టిడిపి నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాస, జగన్ పార్టీల తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నుంచి కర్నూలు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే నీరజా రెడ్డి, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, తదితరులు పావులు కదుపుతున్నారు. ఇటు వైఎస్ఆర్ పై అభిమానం, అటు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని జగన్ తో జట్టు కట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
తాజాగా ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయ ఢంకా మోగించడంతో తెదెపా, కాంగ్రెస్ అధినేతలు ఖంగుతిన్న విషయం విధితమే. వలసలను నివారించేందుకు రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నూతన ఎమ్మెల్యేలను రాజధానిలో ఫ్లాట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అలాగే నారా చంద్రబాబు నాయుడు సైతం 2014లో అధికారం వస్తే అమాత్య పదవులిస్తానని ఆశలు రేకెత్తిస్తున్నారు. వలసలను ఆపేందుకు నల్లారి, నారాలు అష్టకష్టాలు పడుతున్నరని తెలియకనే తెలుస్తొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి