అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన ప్రస్తుతం దేశ ప్రజలను మొత్తం ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రముఖులు ట్రంప్  పర్యటన పై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి సారి భారత్లో పర్యటిస్తుండటంతో  ప్రపంచం చూపు మొత్తం భారత్ వైపు ఉంది. కాగా..ట్రంప్  పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్ నగరంలో మొత్తం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అమెరికా స్పెషల్ సర్వీస్ ఏజెన్సీ కూడా ట్రంప్కు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. తమ పర్యటన నేపథ్యంలో వందకోట్ల ఖర్చు  చేస్తుంది మోడీ సర్కార్. 

 


 అయితే ప్రస్తుతం ట్రంప్  పర్యటన నేపథ్యంలో ప్రతి ఒక్క విషయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఇప్పటికే ట్రంప్  అహ్మదాబాద్లోని ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఘన స్వాగతం పలికేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ట్రంప్  కుటుంబ సభ్యులు ఎక్కడ బస చేయనున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. మొదటి రోజు అహ్మదాబాద్ ఆగ్రా పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు దంపతులు. ఇక డోనాల్డ్ ట్రంప్ బస చేయడానికి ఢిల్లీ ఐటీసీ మౌర్య  హోటల్ లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ ను కేంద్ర ప్రభుత్వం బుక్ చేసింది. 

 

 అయితే ఒక్క రాత్రి ఆ సూట్ లో ఉండడానికి ఎనిమిది లక్షల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఒక్కరాత్రి కోసమే అంత ఖర్చు చేస్తున్నారా  అని అంటున్నారు నెటిజన్లు. అయితే ప్రపంచ దేశాలకే పెద్దన్న లాంటి ట్రంప్ అంటే మామూలు విషయం కాదు కదా ఆ మాత్రం ఉండాలి అంటూ  కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ట్రంప్  ఉండబోయే గ్రాండ్ రెసిడెన్షియల్ సూటు ప్రత్యేకత ఏమిటంటే. సిల్క్ పానెల్ గోడలు వుడెన్ ఫ్లోరింగ్,  అదిరిపోయే కళాకృతులు,  సౌకర్యవంతమైన లివింగ్ రూమ్ ప్రత్యేకమైన డైనింగ్,  విలాసవంతమైన రెస్ట్ రూమ్.. మిని స్పా, అధునాతన సాంకేతిక కలిగిన 55 అంగుళాల  టీవీ ఐపాడ్ టాకింగ్ స్టేషన్ ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రోబయాలజీ లాబరేటరీ... బయట గాలి  ఎలా ఉన్నప్పటికీ లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంపు బస చేసేందుకు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్ ఎంతో అద్భుతం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: