ప్రతీ రాజకీయ పార్టీలో వర్గ పోరు సహజం. పార్టీ పెద్దలు దానిని జాగ్రత్తగా గమనించి అప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అదే సమయంలో విఫలం అయితే కష్టాలు కూడా తప్పవు. అటువంటిది అంతా సూపర్ ప్రజలలో అంతా చాలా పాజిటివ్ వాతావరణం ప్రస్తుతం ప్రభుత్వంపై ఉంది అని అనుకుంటున్న జగన్ కి ఒకే ఒక పాయింట్ వద్ద పెద్ద మైనస్ ఏర్పడినట్లు పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారని వైసిపి పార్టీ వర్గాల్లో టాక్. చాలా వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ లు మరియు అభివృద్ధి దేశంలో ఉన్న ప్రముఖ నాయకులనే ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని చాలామంది రాజకీయ నేతలు మాట్లాడటం జరిగింది.

 

అంతే కాకుండా కేవలం తొమ్మిది నెలల పరిపాలనలోనే ఈ విధంగా జగన్ పరిపాలించడం పట్ల తల పండిపోయిన దేశంలో ఉన్న రాజకీయ మేధావులు ఇతడు కచ్చితంగా చరిత్ర సృష్టించే నాయకుడని తెగ పొగుడుతున్నారు. ప్రభుత్వపరంగా మరియు పరిపాలన పరంగా అంతా బాగున్నారా అని జగన్ కి మాత్రం పార్టీలో ఉన్న వర్గ పోరు గ్రూపు రాజకీయాలు నచ్చడం లేదట. ముఖ్యంగా ముందు నుండి వైసీపీ పార్టీకి బలమైన నాయకురాలిగా పేరు సంపాదించిన రోజా నియోజకవర్గం ఇలాంటి అనుభవం రావటం మరియు రెండు గ్రూపులుగా విడిపోయే ఆధిపత్యం కోసం కొట్టుకునే స్థాయికి వైసిపి పార్టీ పరిస్థితి దిగజారి పోయినట్లు జగన్ దృష్టికి ఇటీవల సమాచారం వెళ్లిందట.

 

దీంతో ఇటువంటి సమస్యల వల్ల అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా.. కేడర్ విషయంలో పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమేనని అసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపికి గ్రూపు రాజకీయాలు పార్టీకే తలనొప్పులు తెచ్చి పెట్టేటట్లు ఉన్నాయని జగన్ బాధపడుతున్నారు అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: