స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న వైసీపీ అధినేత జగన్ కోరిక నెరవేరడం లేదు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. రిజర్వేషన‌్లు 50 శాతం మించిఉండకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయం ముందు నుంచీ ఊహించిందే.. ఎందుకంటే సుప్రీం కోర్టు కూడా గతంలో ఎన్నోసార్లు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.50 శాతం దాటి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని పలు కేసుల్లో క్లారిటీ ఇచ్చేసింది.

 

 

అయినా సరే దాన్ని దాటి ఇవ్వాలంటే ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. గతంలో తమిళనాడు సర్కారు దీన్ని చేయగలిగింది. ఇలాంటివి చేయాలంటే పార్లమెంటు ద్వారా చట్టం చేసి.. దాన్ని న్యాయ సమీక్షకు ఆస్కారంలేని షెడ్యూళ్లో చేర్చాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం.. జగన్ సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా ఓ జీవో ఇచ్చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచేశాం అని చెప్పుకునే ప్రయత్నం చేసింది.

 

 

దీనికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. రిజర్వేషన్ల వంటి కీలక అంశాల్లో పెద్దగా కసరత్తు చేయకుండా రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే దీన్ని కూడా రాజకీయంగా తమ క్రెడిట్ గా చెప్పుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారు. ఓవైపు హైకోర్టు రిజర్వేషన్లను కొట్టేస్తే.. జోగి రమేశ్ వంటి నేతలు.. ఏకంగా మా జగన్ అభినవ పూలే అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొట్టడం ఏంటో అర్థం కాని విషయం.

 

 

బలహీనవర్గాలను బ్యాక్‌బోన్‌గా, శక్తివంతులుగా తయారు చేస్తుంది సీఎం వైయస్‌ జగన్‌. బలహీనవర్గాలకు నేనున్నానని చెప్పి బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన పోరాడుతున్నాడు. పూలే చెప్పాడు.. అభినవ పూలే సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టంలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో అవకాశం కల్పించారు. 40 ఏళ్ల అనుభవంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా..?.. అంటూ జోగి రమేశ్ రెచ్చిపోయారు. ఇకకైనా వైసీపీ నేతలు కేవలం భజన చేయడం మానేసి.. వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరిస్తే మంచిది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: