ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో 2020 - 2021 బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వం 25,000 రూపాయల వరకు ఉన్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనుంది. ప్రభుత్వం 2020 - 2021 ఏడాదికిగాను 1,82,914.42 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను రూపొందించింది. ప్రభుత్వం బడ్జెట్ లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 
 
మంత్రి హరీష్‌రావు సాగునీటి రంగానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం రైతు బంధు పథకానికి 14,000 కోట్ల రూపాయలు, మున్సిపల్ శాఖకు 14,809 కోట్ల రూపాయలు, మూసీ రివర్ ఫ్రంట్ కోసం 10,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కోసం రాబోయే ఐదేళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 
 
పాఠశాల విద్య కోసం 10,421 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యాశాఖకు 1,723 కోట్ల రూపాయలు, వైద్య రంగానికి 6,156 కోట్ల రూపాయలు, కల్యాణ లక్ష్మీ పథకానికి 1,350 కోట్ల రూపాయలు, పంచాయతీ రాజ్ శాఖకు 23,005 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్టీ సంక్షేమం కోసం 9771 కోట్ల రూపాయలు, ఎస్సీ సంక్షేమం కోసం 16,354 కోట్ల రూపాయలు, మైనారిటీల కోసం 1718 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణానికి 11,917 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. 
 
ఆసరా పెన్షన్ల కోసం 11,750 కోట్ల రూపాయలు, రవాణా, రోడ్లుభవనాలశాఖకు 3,494 కోట్ల రూపాయలు, పోలీస్ శాఖకు 5,852 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 10,416 కోట్ల రూపాయలు, అటవీ శాఖకు 791 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి 1,998 కోట్ల రూపాయలు, ఎస్‌డీపీ నిధుల కోసం 480 కోట్ల రూపాయలు, మైక్రో ఇరిగేషన్ కోసం 600 కోట్ల రూపాయలు, పాడి రైతుల ప్రోత్సాహం కోసం 100 కోట్ల రూపాయలు, మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1200 కోట్ల రూపాయలు, పశుపోషణ.. మత్స్యశాఖకు 1586 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది నుండి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధ్యాప్య పెన్షన్ ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: