మార్చి 15వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి నేడు ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 ఆండ్రూ జాక్సన్ జననం : అమెరికా మాజీ అధ్యక్షుడు అయిన ఆండ్రూ జాక్సన్ 1767 మార్చ్ 15వ తేదీన జన్మించారు. 

 

 మునిమాణిక్యం నరసింహారావు జననం : ఇరవయ్యవ శతాబ్దపు మొదటి పాదంలో కథకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మునిమాణిక్యం నరసింహారావు 1898 మార్చి 15వ తేదీన జన్మించారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు దాంపత్య జీవితంలోని సౌందర్యం ఆయన కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మునిమాణిక్యం నరసింహారావు సృష్టించిన కాంతం  తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది. మునిమాణిక్యం నరసింహారావు ఆయన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమలు ఎన్నింటినో వినిపించేవాడు. తెలుగు హాస్య రచయితలలో మునిమాణిక్యం నరసింహారావు గారికి ప్రత్యేక స్థానం ఉంది. కేవలం హాస్య రచయితగా మాత్రమే కాకుండా మంచి హాస్య ఉపాసకులు మునిమాణిక్యం నరసింహారావు. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులు హాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చిన వాటిని అనుసరించి భాషను కొంచెంకొంచెంగా తమాషాగా మార్చి తెలుగు ప్రేక్షకులకు అందజేసేవారు మునిమాణిక్యం నరసింహారావు. 

 


 ఇలపావులూరి పాండురంగారావు జననం : శతాధిక గ్రంథాలు రచయితల అనువాదకుడిగా ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయినా ఇలపావులూరి పాండురంగారావు 1930 మార్చి 15వ తేదీన జన్మించారు. ఈయన హిందీ సంస్కృత రచనలను తెలుగులోకి... తెలుగు నుండి హిందీ ఇంగ్లీషు భాషలను అనేక పుస్తకాలను అనువదించారు. సంస్కృతం నుండి  కేనా,మాండూక్య, ఐతరేయ... లాంటి ఉపనిషత్తులను తెలుగులోకి తర్జుమా చేశారు ఇలపావులూరి పాండురంగారావు. త్యాగరాజ కీర్తనలు కూడా హిందీలో గేయ రూపంలో అనువదించారు ఈయన. అంతే కాకుండా ఎన్నో నవలలు కూడా హిందీలోకి అనువదించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఈయన మరణించారు. 

 

 కాన్షీరామ్ జననం : భారతదేశంలో ప్రముఖ దళిత నేతగా పేరెన్నికగన్న కాన్షీరామ్ 1934 మార్చి 15వ తేదీన జన్మించారు. 


 వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం : ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య 1937 మార్చి 15వ తేదీన జన్మించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య... కథకుడిగా రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. పరిష్కారం,  మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. ఈయన రాసిన ఇంద్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు కూడా పొందాయి. వల్లంపాటి వెంకటసుబ్బయ్య సాహితీ విమర్శకుడిగా కూడా సుప్రసిద్ధుడు.

 


 నామా నాగేశ్వరరావు జననం : ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన నామా నాగేశ్వరరావు... 1957 మార్చి 15వ తేదీన జన్మించారు. నామా నాగేశ్వరరావు ఆంధ్ర రాజకీయాల్లో ఎంతగానో ప్రసిద్ధి చెందారు. ఈయన రాజకీయాలలో ప్రవేశించడానికి ముందే ఆంధ్రప్రదేశ్ లో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గ్రానైట్, కాంట్రాక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియు ఇతరత్రా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు నామా నాగేశ్వరరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: