ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనుకుంటున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రస్తుత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఎన్నికల సంఘం సొంత నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం పై  అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలు విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఎలాంటి మలుపులు తిరిగి పోతుంది అనేది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 

 

 

 కరోనా  వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ జగన్ సర్కారు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఏకంగా జగన్ సర్కార్ న్యాయపోరాటానికి కూడా సిద్ధం అయిన విషయం తెలిసిందే. హైకోర్టు సుప్రీం కోర్టులో ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంతే కాకుండా తదుపరి చర్యలపై కూడా జగన్ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డితో జగన్ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

 

 

 అయితే మాజీ ఎన్నికల కమిషనర్ తో సమావేశంలో పలువురు మంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది.ఇక సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశం తర్వాత జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది  అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది  జగన్ సర్కారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఏకంగా గవర్నర్ కూడా ఫిర్యాదు చేసింది జగన్ సర్కార్. ఇక ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు దీనిపై ఎలా  స్పందించ పోతుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రాథమికంగా జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: