వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సంఘం వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని, ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రోటోకాల్‌ ప్రకారం ముందుకెళ్లాలి కానీ, సొంత ఆలోచనలు చేయొచ్చా అంటూ లాజిక్ తీసి విమర్శలు చేశారు. ఎన్నికలు వాయిదా వేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని, ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ నిర్ణయం వెనక దురుద్దేశం, దురాలోచన చేసే వ్యక్తి ఉన్నట్లుగా అనిపిస్తుందని విమర్శించారు.

 

 

రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాయిదా వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలు గ్రహించాలని సజ్జల రామకృష్ణా రెడ్డి కోరారు. ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు వస్తాయని, వాటిని అడ్డుకునేందుకు ఈసీ సైంధవుడి పాత్ర పోషిస్తుందన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వ పరిధిలోనే ఈసీ భాగమై వ్యవహరించాలి కానీ, పరిధిని మించి నిర్ణయాన్ని తీసుకున్నారని విమర్శించారు.

 

 

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ” ఈసీ నిర్ణయం తప్పు. ప్రాసెస్‌ కూడా ఫాలో కాలేదు. సంబంధం లేని కారణాలు చూపించడం తప్పు. దురాలోచన, దురుద్దేశంతో ఎన్నికల వాయిదా వెనక ఎవరో ఉన్నారని స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా ఉధృతంగా ఉన్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అని ఈసీ చెబుతున్నారు. 6వ తేదీ జరిగిన అఖిలపక్షం సమావేశంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, అనిల్‌ పాల్గొన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకున్నాం.

 

 

కరోనా రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. అన్నీ చూసిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పారు. వాయిదా వేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. మరి నిన్నటి రోజున ఏ ఇన్‌పుట్స్‌ తీసుకొని వాయిదా వేశారు. ప్రోటోకాల్‌ ప్రకారం చీఫ్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీని సంప్రదించాలి అంటూ లాజిక్ గా విమర్శించారు సజ్జల.

మరింత సమాచారం తెలుసుకోండి: