ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని ఏళ్ల పాటు ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసి ఆమెను చిత్ర హింసలకు గురిచేసి చావుకు కారణం అయిన నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరి శిక్ష పడింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులు ( ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌) తీహార్ జైలులో ఉరి వేశారు.  ఇటీవల తెలంగాణ లో దిశ ను అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నింధితులు ఎన్ కౌంటర్ అయిన విషయం తెసిందే. దాంతో దేశ వ్యాప్తంగా  నిర్భయ నింధితుల ఉరిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. ఇంకా ఎన్నాళ్లు చట్టంలోని లొసుగులు ఉపయోగించి తప్పించుకుంటారని ఆరోపణలు రావడంతో ఈ కేసు విషయం సీరియస్ గా తీసుకుంది కోర్టు. 

 

ఎట్టకేలకు నిర్భయ నింధితులకు ఉరిశిక్ష అమలైంది.  తాజాగా  నిర్భయ దోషుల తరపున వాదించిన అడ్వకేట్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఉరిశిక్ష అమలు తర్వాత  ఏపీ సింగ్  మాట్లాడుతూ.. నిర్భయ తల్లిని శిక్షించాలంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు.  రాత్రి 12 గంటల వరకు తన కూతురు  ఎక్కుడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్భయ తల్లి ఆశాదేవిని శిక్షించాలని డిమాండ్ చేశాడు. sc బార్ అసోసియేషన్ ఆలోచించుకోవాలని సూచించారు.   అంతే ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది.. పిచ్చి తిట్టుడు తిడుతూ సోషల్ మీడియాలో ఏపీ సింగ్‌ను తూర్పారబడుతున్నారు. 

 

న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులన్నీ ఈయన ద్వారా తెలిసిపోయాయని.. ఇంత నీచమైన నీ ఆలోచనతో ఆడవాళ్ల ఉసురు పోసుకున్నావని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడం, ఆపై సుప్రీంకోర్టు వెళ్లినా చావుదెబ్బ తగలడంతో ఎట్టకేలకు నలుగురూ ఉరి కంభానికి వేలాడారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అలుపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: