’విపత్కర సమయంలోను జగన్ కు అదే కసి’... అనే హెడ్డింగ్ తో పచ్చమీడియా లోపలి పేజీల్లో ఓ కథనం అచ్చేసుకుంది. అదేమిటయ్య అంటే కరోనా వైరస్ గురించి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కు కొన్ని మీడియా సంస్దలనే ఆహ్వానించారని తెగ బాధపడిపోయింది. మార్చి 15వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశానికి కూడా అందరు విలేకరులను అనుమతించలేదని వాపోయింది.

 

కరోనా వైరస్ తీవ్రత విషయంలో ప్రెస్ మీట్ పెట్టేటపుడు కూడా అదరు మీడియా వాళ్ళని ఎందుకు పిలవలేదని మండిపడింది. అందరినీ పిలిస్తే ఇబ్బంది పడే ప్రశ్నలు వేస్తారనే భావనతోనే కేవలం తనకు అనుకూలంగా ఉండేవారిని మాత్రమే పిలుస్తున్నట్లు ఆరోపించింది. అప్పటికేదో పచ్చమీడియా విలేకరులను సమావేశానికి పిలవకపోవటం సమాజానికి జగన్ ఏదో ద్రోహం చేస్తున్నట్లే మాట్లాడింది. నిజానికి ఏపిలో మీడియాకు సంబంధించి విచిత్రమైన పరిస్ధితి నెలకొన్న మాట వాస్తవమే.

 

నిజమే పచ్చమీడియా విలేకరులకు జగన్ మీడియా సమావేశాలకు ఆహ్వానం ఉండటం లేదు. ఇది ఇపుడే కాదు జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడే వాళ్ళని పిలవకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే తాను ఏమి మాట్లాడినా రాసేది పూర్తి వ్యతిరేకంగానే ఉంటోంది. పైగా పదే పదే జగన్ ను ఉద్దేశ్యపూర్వకంగానే ప్రశ్నలు వేస్తారన్నదీ నిజమే. ఎందుకంటే జగన్ ప్రెస్ మీట్లో ఎటువంటి ప్రశ్నలు వేయాలన్నది టిడిపి కార్యాలయం నుండి డైరెక్షన్ వస్తుందనే ప్రచారం బాగా ఉంది.

 

ఇపుడింతగా బాధపడిపోతున్న పచ్చమీడియా వాళ్ళు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు జగన్ మీడియాను బహిష్కరించినపుడు ఎందుకు నోరెత్తలేదు ?  ప్రశ్నలు వేసిన విలేకరులను పట్టుకుని అందరిలోను చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నపుడు పచ్చమీడియా వాళ్ళు అడ్డం పడలేదే. ఇపుడు కూడా చంద్రబాబు మీడియా సమావేశాలకు జగన్ మీడియాను అనుమతించరన్న విషయం పచ్చమీడియాకు గుర్తు రాలేదా ?  

జగన్ తమను మీడియా సమావేశాలకు పిలవకపోయినా  అంశాలను ఇతర మార్గాల్లో సేకరించి సామాజిక బాధ్యతగా  ప్రజలకు అందించినట్లు సొల్లొకటి మళ్ళీ. నిజంగానే పచ్చమీడియాకు అంతగా సామాజిక బాధ్యతే ఉంటే అధికారంలో ఉన్నపుడు వైసిపిలోని 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను లాక్కున్నపుడు చంద్రబాబు చేసింది తప్పుగా కనబడలేదా ? చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి పచ్చమీడియాకు కనబడలేదా ?  24 గంటలూ జగన్ ప్రభుత్వంలో బొక్కలెక్కడ ఉంటాయో వెతికి వెతికి మరీ బూతద్దంలో చూపటాన్ని కూడా సామాజిక బాధ్యతనే అంటారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: