ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు హాయిగా సాగిపోతున్న కాపురంలో చిచ్చు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు ఆత్మహత్యలు కూడా ఈ రోజుల్లో పెరిగిపోతూనే ఉన్నాయి. హాయిగా సాగిపోతున్న దాంపత్యంలో కి మూడో వ్యక్తి రావడం... మూడో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న వారిని వదిలేయడం ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త కళ్ళు కప్పి ఎన్నో రోజుల నుంచి ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తున్న భార్య బండారం బయటపడింది. అది కూడా జనతా కర్ఫ్యూ కారణంగా భార్య నిజస్వరూపం బట్టబయలు అయింది. 

 

 

 జనతా కర్ఫ్యూ నేపథ్యంలో భర్త ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు... ఈ క్రమంలోనే భార్య సెల్ ఫోన్ లో గేమ్ ఆడిన భర్త భార్య వాట్సప్ ఓపెన్ చేయగా  అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని ఫరుక్కాబాద్ జిల్లా  రాయపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివ చంద్ర ఠాగూర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక అతని భార్య రాధాదేవి పిల్లలతో కలిసి స్వగ్రామంలోనే నివసిస్తుంది. ఇక ఢిల్లీలో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన భర్త శివ చంద్ర ఠాగూర్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి భార్య పిల్లలతో సరదాగా గడిపి వెళ్ళేవాడు. అయితే ఏకాంతాన్ని తట్టుకోలేక పోయిన భార్య... అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధానికి తెరలేపింది.

 

 

 ఇక భర్త కూడా ఇంట్లో లేకపోవటం..  ఉద్యోగ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడంతో పిల్లలను స్కూల్ కి పంపి ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలుతూ ఉండేది. రోజు వాట్సాప్ చాటింగ్ లో కూడా వీరిద్దరూ రాసలీలలు కొనసాగించేవారు. భర్త ఇంటికి వచ్చే సమయానికి భార్యచాటింగ్ మొత్తం డిలీట్ చేసి ఉండేది. దీంతో తన అక్రమ సంబంధం బయటపడకుండా జాగ్రత్త పడింది భార్య. కానీ ఇటీవల  వాట్సాప్ చాటింగ్ కాస్త డిలీట్ చేయడం మర్చిపోయింది భార్య . జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇంట్లో ఉండి కుటుంబంతో హాయిగా గడుపుదామని వచ్చిన భర్త... భార్య ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉండగా ఇంతలోనే వాట్స్అప్ ఓపెన్ చేసి  చూసాడు. దీంతో అందులో భార్య ప్రియుడితో చేసిన చాటింగ్ చూసి షాక్ కి గురయ్యారు భర్త. ఇదేంటి అని ప్రశ్నించగా భార్య భర్త కు ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే పోలీసులకు ఫోన్ చేస్తాడు భర్త.. పోలీసులు వచ్చేసరికల్లా భార్య  పై చేయి చేసుకున్నాడు. ఇక వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎలా సద్దుమణిగేలా చేయాలో అర్థం కాక వీరిద్దరిని పోలీసులు కౌన్సెలింగ్ సెంటర్ కి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: