కరోనా ప్రభావం వల్ల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో పాటు వైసీపీలోకి వలసలు కూడా ఆగిపోయాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు వరుస పెట్టి వైసీపీలోకి వచ్చేసారు.  మొదట డొక్కా మాణిక్య వరప్రసాద్ నుంచి మొదలు పెడితే మొన్నటిమొన్న శమంతకమణి వరకు అందరూ వైసీపీలోకి వచ్చేసారు.

 

అలాగే దశబ్దాల పాటు టీడీపీలో ఉన్న కరణం బలరాం, రామ సుబ్బారెడ్డిలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇలా టీడీపీ నేతలు వైసీపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే పెద్దగా లేదనే టాక్ ఎక్కువ వినిపిస్తోంది. వైసీపీలో నాయకులకు కొదవ లేదు. అలా అని టీడీపీ నేతలు చేర్చుకోకపోయిన, వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలే రాబట్టేది. ఇప్పుడు కొత్తగా టీడీపీ నేతలని చేర్చుకోవడం వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. ఇక ఇదే విషయాన్ని తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. అసలు టీడీపీ నేతలని తీసుకోవాల్సిన పని వైసీపీకి లేదని, వాళ్ళు రావడం వల్ల వైసీపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు.

 

అయితే అటు నేతలు వెళ్లిపోవడం వల్ల టీడీపీకి కూడా పెద్ద నష్టమేమీ జరగలేదని అర్ధమవుతుంది. కాకపోతే ఒక్క కడప జిల్లాలో మాత్రం టీడీపీకి భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. ఇదే సమయంలో కడపలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది. కాబట్టి అక్కడ టీడీపీ నేతలు వచ్చిన పెద్ద మార్పు ఏం ఉండదు. కాగా, ఉండవల్లి కాస్త జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తినే ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆయన మాటలు బట్టి చూస్తుంటే అదే అనిపిస్తోంది. వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ ని కులం పేరిట విమర్శించడం కూడా ఆయన తప్పుబట్టారు. ఆ విషయంలో జగన్ కూడా  కాస్త ఆలోచించాల్సిన అవసరముందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: