కరోనా వైరస్ దెబ్బకు దేశం అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో దేశాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్లు ముందుకొస్తున్నారు. ఆపత్కాలంలో ప్రధానమంత్రి సంరక్షణా నిధికి నిధులు అందజేస్తున్నారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా శనివారం రోజున 500 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్ 1000 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
 
టాటా గ్రూప్ మొత్తం 1500 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. 500 కోట్ల రూపాయలను కరోనా నివారణతో పాటు సహాయక కార్యకలాపాలకు, 1000 కోట్ల రూపాయలను కరోనా సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్ కిట్ల కోసం అందజేయనున్నట్లు టాటా సన్స్ తెలిపింది. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయపడటం కోసం కోటి రూపాయల చొప్పున ఎంపీ ల్యాడ్స్ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. 
 
సన్ ఫార్మా ఇండస్ట్రీస్ కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది. శానిటైజర్లు, అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి కరోనా తగ్గించే మందులను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ సంస్థ హ్యుందయ్ మోటార్స్ అత్యాధునిక వెంటిలేటర్లను, అత్యాధునిక ఉచిత పరీక్షల కిట్లను అందజేయనున్నట్లు ప్రకటన చేసింది. 
 
అదానీ గ్రూప్ అధిపతి 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించగా... జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ మరో రూ.100 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ సంస్థ 25 కోట్ల రూపాయలను పీఎం కేర్స్ నిధికి విరాళంగా ప్రకటించారు. ప్రముఖ జ్యూయెలరీ సంస్థ కళ్యాణ్ జ్యూయెలర్స్ కరోనాపై పోరులో భాగంగా 10 కోట్ల రూపాయల సాయానికి ముందుకొచ్చింది. కరోనా కట్టడి కోసం కార్పొరేట్ సంస్థలు భారీ మొత్తంగా విరాళాలు ప్రకటించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: