ఏపీలో కరోనా రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల క్రితం రాష్ట్రంపై కరోనా ప్రభావం పెద్దగా లేదు. కానీ గత నాలుగు రోజుల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలోని నాలుగు జిల్లాలలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఈరోజు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 180కు చేరింది. 
 
రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 27 కేసులు నమోదు కాగా గుంటూరులో 23, కడపలో 23 కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 
 
ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో నలుగురు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలోని 11 జిల్లాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కరోనా కేసులు నమోదు కాలేదు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలలో కూడా కరోనా ప్రభావం ఇతర జిల్లాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. 
 
అనంతపురం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. కర్నూలులో నమోదైన నాలుగు కేసులలో ముగ్గురు మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారే అని తెలుస్తోంది. మరోవైపు రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు సర్వేలు నిర్వహించి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: