ఓ వారం రోజుల క్రితం వరకూ దేశంలోని చాలామందికి ఢిల్లీలొని మర్కజ్ మసీదు పేరు కూడా తెలిసుండదు. అలాంటిది కరోనా వైరస్ పుణ్యమా అని ఒక్కసారిగా ఇండియాలోనే కాదు ఏకంగా వరల్డ్ ఫేమస్ కూడా అయిపోయింది. ఎందుకంత ఫేమస్ అయిపోయిందంటే కరోనా వైరస్ వ్యాప్తికి మర్కజ్ మసీదే ప్రధాన కారణం కాబట్టి. వైరస్ వ్యాప్తి గురించి చెప్పాలంటే మర్కజ్ మసీదులో ప్రార్ధనలు మొదలవ్వక ముందు అయిపోయిన తర్వాత అని చెప్పుకోవాలి.

 

మసీదులో ప్రార్ధనలైపోయి ఎవరి సొంతూర్లకు వాళ్ళు వెళ్ళిపోయిన వారిలో కొందరి కారణంగా  వైరస్ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. సరే  ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే అసలు మసీదులో పరిస్ధితుల గురించి అనేక విషయాలు ఒక్కోటిగా బయటకు వస్తోంది. నిజంగా అవన్నీ నిజమో కాదో నిర్వాహకులే కన్ఫర్మ్  చేయాలి.

 

ఇంతకీ ప్రచారంలో ఉన్నదాని ప్రకారం మసీదు అయినా అందులోని సౌకర్యాలు మహా అయితే ఓ రెండు మూడు వందలమందికి మాత్రమే సరిపోతుందట. కానీ అందులో 15 రోజులుగా సుమారు 13 వేలమందున్నారు. అంటే పరిస్ధితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.  మసీదులో ప్రార్ధనలకని వెళ్ళిన వేలాదిమంది కొద్ది రోజుల పాటు ఒకేచోట భోజనం చేసి, పడుకున్నారట.

 

భోజనం చేసినపుడు మంచినీళ్ళ సమస్య వచ్చిందని మొదటి వరసలో భోజనం చేసిన ప్లేట్లను కడగకుండానే తరువాత వరసలో భోజనం చేసిన వారు అవే ప్లేట్లలో తిన్నారట. ఇలాగ ఎనిమిది వరసల్లో భోజనాలు చేశారట. ఇలా ప్రార్ధనలు జరిగినన్ని రోజులు ఇలాగే  జరిగిందని సమాచారం. భోజనం దగ్గరే పరిస్ధితి ఇలాగుంటే ఇక టాయిలెట్ల దగ్గర పరిస్ధితి ఎలాగుంటుందో ఊహించుకోవచ్చు.

 

కేవలం కొద్దిమందికి మాత్రమే సరిపోయే టాయిలెట్లను కొన్ని వేలమంది ఉపయోగించుకున్నారట. భోజనం ప్లేట్లను శుభ్రం చేయకుండానే వేలాదిమంది ఉపయోగంచుకోవటం, సరిగా శుభ్రం చేయకుండానే టాయిలెట్లను వేలాదిమంది వాడటం లాంటి వాటివల్లే కరోనా వైరస్ చాలామందికి సోకిందని తెలుస్తోంది. విదేశాల నుండి రావటమే వైరస్ తో రావటంతో  15 రోజులు ఒకేచోట కొన్ని వేలమంది ఉన్న కారణంగా వైరస్ ఒకేసారి కొన్ని వందలమందికి సోకుంటుందని అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: