వైయస్ విజయమ్మ.... దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లిగా ప్రజలందరికీ సుపరిచితమైన పేరు. 2009లో వైయస్సార్ మరణానంతరం తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈమె గౌరవ అధ్యక్షురాలిగా ఉండి 2014, 2019 ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు. 
 
వైయస్సార్ మరణానంతరం ఎదురైన అవమానాలకు 2019లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కొడుకు గెలుపుతో ప్రత్యర్థులకు సమాధానం ఇచ్చారు. 2009 - 2019 మధ్య కాలంలో కాంగ్రెస్, టీడీపీ  వైయస్ కుటుంబంపై అనేక విమర్శలు, ఆరోపణలు చేశాయి. వైసీపీ స్థాపించిన రోజు నుంచి విజయమ్మ పార్టీ గెలుపు కోసం, తనయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అలుపెరగకుండా కష్టపడ్డారు. 
 
వైయస్సార్ మృతి చెందే వరకు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న విజయమ్మ... 2012 ఉపఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల జగన్ అరెస్టయితే తన కూతురు షర్మిలతో కలిసి నియోజకవర్గాలను చుట్టివచ్చారు. రాజకీయానుభవం, వాగ్ధాటి లేకపోయినా వైయస్ సతీమణిగా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. రాజకీయాల్లో జగన్ సాధించిన ప్రతి విజయం వెనుక విజయమ్మ పాత్ర ఎంతో ఉంది. 
 
నిజానికి 2014లోనే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019లో జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆనంద భాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. తనకు జన్మనిచ్చిన వైయస్ విజయమ్మకు జగన్ వేదికపై పాదాభివందనం చేశారు. 10 ఏళ్లలో ఎదురైన ప్రతి అవమానానికి కొడుకు గెలుపుతో విజయమ్మ ధీటైన సమాధానం చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాల్లో వైసీపీ ఘనవిజయం సాధించడానికి ఎంతో కష్టపడి కాంగ్రెస్, టీడీపీ నేతలు చేసిన అవమానాలకు కొడుకు గెలుపుతో విజయమ్మ సమాధానం చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: