దేశంలో ఎక్కడ చూసినా కరోనా  భయమే కనిపిస్తోంది... ఎవరిని కదిలించినా కన్నీటి గాధలు వినిపిస్తున్నాయి... ఎక్కడ చూసినా ఈ మహమ్మారి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారే  కనిపిస్తున్నారు. దేశ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిపోయారూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను  తరిమికొట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా ను తరిమికొట్టేందుకు  కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాయి. ఇన్ని చేస్తున్నా కరుణ వైరస్ కట్టడి మాత్రం ఎక్కడా జరగడం లేదు. రోజు రోజుకి మహమ్మారి వైరస్ కోరలు చాస్తూ  ఎంతోమందికి వ్యాప్తి చెందుతుంది. 

 

 

 దీంతో భారత ప్రజానీకం మొత్తం ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతోంది. అయితే కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించగా దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు రక్షించడానికి కనిపించని శత్రువుతో పోరాడుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు. ప్రస్తుతం దేశంలో వీరే  రియల్ హీరోలు, కంటికి కనిపించే దైవం అని చెప్పవచ్చు . చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ముందుకొచ్చి మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. 

 

 

 కానీ చివరికి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వస్తుంది డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స చేస్తూ వారు కూడా కరోనా  వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక కరోనా  వైరస్ పోరాటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కూడా కీలకమైనది అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏకంగా 39 మంది పారిశుద్ధ్య కార్మికులు కరోనా  వైరస్ మహమ్మారి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఢిల్లీ మున్సిపల్ లో పనిచేసే 39 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వైరస్ సోకగా.. వారిని ప్రస్తుతం ఐసోలేషన్ లో  ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఇది ఎంతగానో కలకలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటికే చాలా మంది డాక్టర్లకు పోలీసులకు జర్నలిస్టులకు పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: