పాకిస్తాన్ లో  రోజురోజుకు కరోనా  వైరస్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ రోజురోజుకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆహారధాన్యాల కొరత ఏర్పడటంతో పాటు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక కరోనా తో  బారినపడుతున్న వారు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వానికి కూడా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది, ఇదిలా ఉంటే తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కొత్త తలనొప్పి మొదలైంది. అయితే పాకిస్తాన్ లో  ఉన్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి డబ్బులు ఇవ్వడం.. ఇక ఈ వ్యవహారాలన్నీ ఇమ్రాన్ ఖాన్ డైరెక్టర్గా చూసుకోవడం. జరిగింది.

 

 ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిదికి  కరోనా  వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో.. ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హౌస్ క్వారంటైన్ కి  వెళ్ళక తప్పడం లేదు. అయితే ప్రస్తుతం బయటికి ఈ విషయం ఎక్కడ పొక్కకుండా అతిగా ప్రచారం కాకుండా రహాస్యంగానే  హౌస్ క్వారంటైన్  లోకి వెళ్ళిన విషయాన్ని దాస్తున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ సెక్యూరిటీ గా ఉన్న వారిలో  కూడా ఒకరికి కరోనా  వైరస్ పాజిటివ్  వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్  నీ కరోనా  వదిలిపెట్టడం లేదు అన్న విషయం అర్థమవుతుంది. 

 

 మొన్నటివరకు పాక్ ప్రధాని ఇమ్రాన్  ను  కలిసిన వ్యక్తికి కరోనా  వైరస్ పాజిటివ్ రావటం...  తాజాగా ఇమ్రాన్ ఖాన్ సెక్యూరిటీ లో ఒక వ్యక్తీకి కరోనా వైరస్ పాజిటివ్ రావటం  ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ సైతం పరీక్షలు చేయించుకోగా  నెగిటివ్ వచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పాక్ ప్రధాని హోమ్ క్వారంటైన్  కి వెళ్ళిపోయారు. దీంతో ఇంట్లో ఉంటూనే  అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. అయితే రంజాన్ మాసం వస్తున్న నేపథ్యంలో అక్కడ రంజాన్ మాసం యొక్క ప్రార్థనలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ క్వారంటైన్  లో ఉంటూ ప్రార్థనలను ఎలా కంట్రోల్ చేయాలి అనే దానిపై కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా ప్రస్తుతం  ఇమ్రాన్ ఖాన్ అంశం మాత్రం పాకిస్తాన్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: