తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య దాదాపు వెయ్యికి చేరువైంది. ఈ కేసుల్లో మెజారిటీ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అందుకే హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. తమ పక్క ప్రాంతంలో కరోనా కేసు కనిపించిందన్న వార్తలు వింటేనే హడలిపోతున్నారు. అసలే జనసమ్మర్థమున్న ప్రాంతం.. యాక్టివిటీస్‌ ఎక్కువ.. ఎటు పోతే ఎటు నుంచి వచ్చి వైరస్ అంటుకుంటుందో అన్న భయాందోళనలు కనిపిస్తున్నాయి.

 

 

అయితే ఇంతటి భయంకర పరిస్థితుల్లోనూ హైదరాబాద్ వాసులకు కొన్ని శుభవార్తలు ఉన్నాయి. అదేంటంటే.. హైదరాబాద్ లో వందలకొద్దీ కరోనా కేసులు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయట. కరోనా రోజురోజుకీ విస్తరిస్తున్నా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఉరటిస్తోంది.

 

 

ఈ మూడు పోలీసు కమిషనరేట్లలోని 57 పోలీసు స్టేషన్ల పరిధిలోకి వచ్చే కాలనీలు, బస్తీల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదట. హైదరాబాద్ లో తబ్లిగీ జమాతే ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారానే 80శాతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. మరికొన్ని విశేషాలేటంటే.. ఇది పెద్గగా వ్యాపించకపోవడం.. ఉదాహరణకు పాతబస్తీలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కానీ ఆ పక్కనే ఉన్న చార్మినార్‌ పోలీసు ఠాణాలో ఒక్క కేసు నమోదు కాలేదు.

 

 

అలాగే రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని 27 ఠాణాల పరిధుల్లో ఇప్పటి వరకూ వైరస్‌ జాడ కనిపించలేదు. హైదరాబాద్‌లో 15, సైబరాబాద్‌లో 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు లేవు. అందుకే పోలీసులు కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలపై దృష్టి దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: