ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు... తక్కువ ధరలకే మొబైల్ డేటా .. అది కూడా అన్లిమిటెడ్... ఇంకేముంది ఏదో మంచి పనుల కోసం ఉపయోగిస్తారు అనుకుంటే ఎక్కువగా పోర్న్ వెబ్సైట్ లను  చూడడానికి వినియోగిస్తున్నారు ఈ డేటాను . ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఇలా పోర్న్ సైట్స్ చూస్తూ ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. అంతేకాదండోయ్ ఇప్పుడు పోర్న్ వీడియోలు చూసి  ఏకంగా నేరాలు కూడా పాల్పడుతున్నారు. ఎంతో మంది భార్యా భర్తల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాయి ఈ పోర్న్ సైట్స్.  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఏదేమైనా ఈ మధ్య కాలంలో మాత్రం పోర్న్  వెబ్సైట్లకు బానిసలుగా మారిపోతున్నవారు ఎక్కువ అవుతున్నారు. 

 

 తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి పోర్న్ వెబ్సైట్ కి బానిస గా మారి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. పోర్న్  వెబ్సైట్ కి  బానిసగా మారాడు అన్న కారణంతో అత్తింటి వారు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్  లోని ఓ ప్రాంతానికి చెందిన యువతి ఆర్కె నగర్ కు చెందిన కార్కీ  వ్యక్తిని కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. నత్తిరవిలై  లో నివాసం ఉంటూ  సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం నాడు భర్త కార్కి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 

 


 స్థానికులు  పోలీసులకు సమాచారం అందించగా ఓటు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో  పలు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే భార్యను విచారించగా తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటూ పొంతనలేని సమాధానం చెప్పు కుంటూ వచ్చింది. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన హత్య జరిగినట్టు  తేలింది. దీంతో భార్యను అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. తన తండ్రి తమ్ముడు ఇద్దరు కలిసి భర్తను కొట్టినట్లు పోలీసు విచారణలో తెలిపింది  సదరు మహిళ. అయితే సెల్ఫోన్లు ఎప్పటికీ పోర్న్ వీడియోలు చూస్తూ... వాటిని బానిసగా మారాడు అని... పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినక పోవడంతో తన కుటుంబ సభ్యులకు తన బాధను చెప్పగా... తన తండ్రి, తమ్ముడు  తన భర్తతో గొడవపడగా ఈ క్రమంలోనే చేయి చేసుకోవడంతో  భర్త ప్రాణాలు కోల్పోయాడు అంటూ వెల్లడించింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళ తండ్రి  తమ్ముడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: