ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమించిన వారి తో గొడవ అయిందని లేదా ఇంట్లో వాళ్ళు మందలించారని లేదా ఇంకేదైనా కారణం తోనూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు చాలామంది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపుతున్నారు. తాజాగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది. తమ కూతురికి గ్రామ వాలంటీర్ గా ఉద్యోగం వచ్చింది అని ఎంతో సంతోషపడ్డారు తల్లిదండ్రులు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలలేదు. అంతలోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణం అనే విషయం బయటపడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లాలో  ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

 


 వివరాల్లోకి వెళితే... దుండిపాలెం గ్రామంలో ప్రభుత్వ వాలింటర్  గా పనిచేస్తుంది బాంధవి అనే యువతి. ఆదివారం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.  అయితే సదరు యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం అదే గ్రామానికి చెందిన వాలింటర్ శ్రీనివాస్ తో ప్రేమ వ్యవహారమే అని తెలుస్తోంది. తమ కుమార్తెను శ్రీనివాస్ ఎంతో తీవ్రంగా వేధించేవాడని.. ఆ వేధింపులు తాళలేక తమ కుమార్తె బాంధవి  ఆత్మహత్య చేసుకుంది అని... తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయం గ్రామం మొత్తం పారిపోవడంతో గ్రామస్తులు వాలెంటర్ శ్రీనివాస్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

 


 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా మృతురాలి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అసలు బాంధవి శ్రీనివాస్ ల మధ్య ప్రేమ వ్యవహారం నిజంగానే ఉందా... లేదా శ్రీనివాస్ కావాలని బాంధవి ని వేదించాడ అన్న కోణాల్లో ప్రస్తుతం ఎంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అయితే గ్రామ వాలింటర్ గా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది పోయి ఇలా వ్యవహరించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: