గత నెల రోజులుగా సరిహద్దు వివాదంతో చైనా దేశం తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా చైనా సరిహద్దు వెంబడి 4000 కిలోమీటర్ల పొడవైన లైన్ ఆఫ్ కంట్రోల్ లో లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సైనిక స్థావరాలను సిద్ధం చేసింది. భారత్ కూడా చైనా విషయంలో అప్రమత్తంగా ఉంది. సరిహద్దు రేఖ వెంబడి పహారా దళాల సంఖ్యను పెంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని కూడా స్టాండ్ బై మోడ్ లో ఉంచింది. 
 
ఇరు సైన్యాలు పాంగోంగ్ సో, దౌలత్ బేగ్ ఓల్డి, డెమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో బలగాలను మోహరించాయి. ఒకవైపు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామని చెబుతూనే చైనా మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోవైపు మన దేశంలో కొంతమంది చైనా ప్రేమికులు చైనాతో యుద్ధానికి వెళ్లినా భారత్ కే నష్టమని వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనా సైనిక సామర్థ్యంతో పోలిస్తే భారత్ సరితూగదని పలువురు మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే చైనాను భారత్ సులభంగా ఓడించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో భారత సైన్యానికి యుద్ధానుభవం ఉండగా చైనా సైన్యానికి ఎలాంటి యుద్ధానుభవం లేదని చెబుతున్నారు. 95 శాతం చైనా సైనికులు వారి తల్లిదండుల యొక్క ఏకైక సంతానం. అందువల్ల వారికి బ్రతుకుపై తీపి ఎక్కువ. మన దేశ సైనికుల్లో దేశభక్తి ఉండటంతో పాటు సైనికులకు కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ ఎక్కువ. 
 
చావోరేవో తేల్చుకుందాం అనేలా ఉండటం భారత సైనికుల లక్షణం. చైనా ఇప్పటివరకు తైవాన్ దేశాన్నే ఏమీ చేయలేకపోయింది. 1967లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో భారత సైన్యానికి పూర్తి స్వాతంత్రం లభించి ఉంటే మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడం సాధ్యమయ్యేది కాదు. వియత్నాం, తైవాన్ లాంటి చిన్న దేశాలపై గెలవలేని చైనా భారత్ పై గెలవడం అసాధ్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: