మూడు రోజుల క్రితం నిమ్మగడ్డ- సుజనా చౌదరి- కామినేని శ్రీనివాస్ రహస్య భేటీ గురించి ఎన్టీవీ, సాక్షి, టీవీ9 సహా దాదాపు అన్ని టీవీ ఛానళ్లలోనూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వీరు ముగ్గురు రహస్యంగా భేటీ అయినట్టు ఆధారాలతో సహా నిరూపితమైంది. ఈ విషయాన్ని అటు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఇద్దరూ వివరణ ఇవ్వడం ద్వారా భేటీ నిజమే అన్న విషయాన్ని ఒప్పేసుకున్నారు.

 

 

రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానని చెప్పుకునే నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఓ హోటళ్లో సీక్రెట్ గా వీళ్లిద్దరినీ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఇంత జరిగినా తనపై ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే నిమ్మగడ్డ వైఖరే అంత.. అప్పట్లో ఆయన కేంద్రానికి లేఖ రాసిన సమయంలోనూ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నా దానిపై అంత సులభంగా స్పందించలేదు. ఎన్నాళ్లకో అది తాను రాసిందేనని ఒప్పుకున్నాడు.

 

 

అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఈ ముగ్గురు భేటీ గురించి టీవీ ఛానళ్లలో ప్రముఖంగా వచ్చినా.. ప్రింట్ మీడియాలో మాత్రం ప్రధాన పత్రికల్లో తెలుగు దేశం అనుకూల మీడియాలో మాత్రం వార్తలు రావడం లేదు. ఇదే విషయంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నగరి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ ప‌దవిలో ఉన్న వ్యక్తి అనైతిక కార్యక్రమాల‌కు పాల్పడ‌టం దారుణ‌మ‌ని ఆమె అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలవడం వెనుక కుట్ర ఉందని రోజా ఆరోపించారు.

 

 

అయితే ఈ విషయాలపై మాత్రం పసుపు మీడియా వార్తలు ఇవ్వదని ఆమె ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో ఇలాంటి వార్తలు రాయర‌ని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని పసుపు మీడియా చూస్తోందని.. కానీ ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: