తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది స్టార్ హీరోయిన్లు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు అన్న విషయం తెలిసిందే. తమ నటనతో పాత్రలతో గొప్ప నటులుగా  పేరు సంపాదించుకున్నారూ . ఇలా కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదింది అన్నది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటినుంచి ఎక్కడ అందాల ఆరబోతకు తావివ్వకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ వచ్చిన కీర్తి సురేష్... తెలుగు తెరను  దశాబ్దాల పాటు ఏలిన మహానటి సావిత్రి జీవిత చరిత్ర లో సావిత్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది.



 మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించిన తీరు... నేటితరం ప్రేక్షకులందరికీ అసలు సావిత్రి అంటే కీర్తి సురేష్ ఏమో అనేంతలా  ప్రభావితం చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది ఈ స్టార్ హీరోయిన్. ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా తన పిల్లల కోసం ఎంతగానో ఆరాటపడి పోయే తల్లిగా కీర్తి సురేష్ నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.




 అయితే కరోనా  లాక్ డౌన్ కారణంగా సినిమా చిత్రీకరణలు  నిలిచిపోయి అందరు సినీ ప్రముఖులు ఇంటి పట్టునే  ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు మొదలవుతున్నాయి. అయితే ఇటీవల ఓ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో... లాక్ డౌన్ తర్వాత కీర్తి సురేష్ చేసిన తొలి సినిమా షూటింగ్ ఏది అన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది  కీర్తి సురేష్. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత.. తాను షూటింగ్ లో పాల్గొన్న మొదటి సినిమా... సూపర్ స్టార్ రజినీకాంత్ సర్ తో చేస్తున్న సినిమా అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: