ఈ మధ్యకాలం లో చిన్న చిన్న కారణాల కే ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీది కి వస్తున్న విషయం తెలిసిందే. నిండు నూరేళ్లు జీవించాల్సిన జీవితాన్ని అర్ధాంతరం గానే ముగిస్తున్నారు ఎంతోమంది. ముఖ్యంగా తెలిసీ తెలియని వయసులో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులతో గొడవపడ్డ కొడుకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.



 వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంకి  చెందిన త్రిమూర్తులు రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వాచ్మెన్ గా పని చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. ఇక అతని కుమారుడు సురేష్ బల్కంపేట లో డీజే షాప్  లో ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. ఇక రాత్రి సమయంలో భోజనం చేసి స్నేహితులతో నిద్రపోతూ ఉండేవాడు. కానీ ఏడాది క్రితం స్నేహితులు గది ఖాళీ చేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. స్నేహితులతో ఉన్న సమయంలో జల్సాలకు అలవాటు పడిన సురేష్ తర్వాత అలవాట్లను మార్చుకోక లేకపోయాడు.



 తల్లిదండ్రులను డబ్బులు కావాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు లేవు అని చెప్పినప్పటికీ కూడా ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇక ఇటీవలే తల్లిదండ్రులను డబ్బులు అడగటం తో వాళ్లు ఇవ్వము అంటూ తెగేసి చెప్పేశారు. దీంతో  తీవ్ర మనస్తాపం చెందిన సురేష్ ఉదయం గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. ఇక చివరికి ఎంతకీ బయటకి రాకపొయేసరికి  అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెళ్లి చూడగా తలుపులు తీయలేదు. ఏం జరిగిందని కిటికీలోంచి చూసేసరికి ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతు కనిపించడంతో వెంటనే.. పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: