దీంతో భారత ఆర్మీ కూడా భారీగా మొహరింపు జరపడంతో చైనా కు భారీ షాక్ తగిలింది. అయితే భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్తత దృశ్య... ప్రస్తుతం చైనా మాజీ ఆర్మీ అధికారులు సైతం చైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ను తక్కువ అంచనా వేస్తే వినాశనం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల చైనా మాజీ లెఫ్టీనెంట్ ఆర్మీ అధికారి ఇటీవలే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. చైనా దళాలు భారత ఆర్మీ ని ఏమాత్రం తేలిగ్గా తీసుకున్న ప్రమాదం తప్పదు అంటూ హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న భారత్-చైనా కు భారీ షాక్ ఇవ్వడం ఖాయం అంటూ తెలిపారు.
సరిహద్దులో చైనా సైనికులకు పోటీగా భారత్ కూడా భారీగా సైనికులను మోహరించింది అన్న విషయాన్ని గుర్తు చేశారు ఆయన. భారత దళాలు చైనా సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరం లో ఉన్నాయని యుద్ధం మొదలైతే కేవలం నిమిషాల వ్యవధిలో దూసుకువచ్చి విధ్వంసం సృష్టించే సత్తా ఈ ఆయుధాలను ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ చైనా తైవాన్ మధ్య ఘర్షణ జరిగితే అమెరికా రంగంలోకి దిగి దాడి చేసే ప్రమాదం ఉంది.. అదే సమయంలో భారత్ కూడా చైనాపై యుద్ధం చేసే అవకాశం ఉంది అంటూ ఆయన హెచ్చరించారు. భారత్ విషయంలో చైనా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి