వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఇప్పటికీ చాలా మంది పేదలు తమ పాలిట దేవుడుగా భావిస్తారు.. అందుకు ప్రధాన కారణం ఆయన పేదల సమస్యలను అర్థం చేసుకోవడమే .. అందుకు చేతనైనంత వరకూ పరిష్కారం చూపించడమే.. అలా అర్థం చేసుకున్నందువల్లే ఆయన ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రూపొందించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంతో పాటు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలు వైఎస్ హయాంలో ప్రారంభమైనవే. అందుకే వైఎస్ క్రేజ్ ఆ తర్వాత కాలంలో జగన్‌ కూ వచ్చింది.

ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే రూల్స్ విషయంలోనూ వైఎస్ లైట్ గా తీసుకునేవారు. ఉదాహరణకు అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అటవీ భూముల హక్కుల బదలాయింపు ప్రక్రియ చాలా సంక్షిష్టంగా ఉంటుంది. అయినా సరే అప్పట్లో వైఎస్ గిరిజనుల కోసం ఆ రూల్స్ ను పక్కన పెట్టారు. గిరిజనులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో నిబంధనలను సైతం మార్చారు. చేస్తున్నది గిరిజనులకు, పేదలకు ఉపయోగపడుతుందంటే ఎలాంటి సాహసానికైనా సిద్ధం అనేవారు వైఎస్.


అందుకే.. ఆయన హయాంలో తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై హక్కులు కల్పించారు. వైఎస్ హయాంలో 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను వైఎస్ అప్పట్లో పంపిణీ చేశారు. ఆ తరవాత వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ గిరిజనుల గోడును పట్టించుకోలేదు. ఇక జనం జగన్‌లో వైఎస్ ను చూసుకున్నారు కాబట్టే జగన్ కు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు జగన్ కూడా జనం నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే గాంధీ జయంతి వేళ.. జగన్ లక్షన్నర మంది గిరిజన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి భూమిపై హక్కులు కల్పించారు.

పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజు వారి కల సాకారం చేశారు. గిరిజన రైతులకు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పత్రాలను పంపిణీ చేస్తున్నారు. దాదాపు 1.53 లక్షల మంది గిరిజన రైతులకు సుమారు మూడు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: