రాజకీయాల్లో సమిష్టి కృషి, ఇతర నాయకుల సహాయ సహకారాలు లేనిదే ఏ పార్టీ ముందుకు సాగదు.. పార్టీ కార్యకర్త లేనిదే  ఏ పార్టీ కనీస గుర్తింపు కూడా తెచ్చుకోలేదు.. అయితే ఎంతో ఫ్యాన్ బేస్, కార్యకర్తల అండ ఉన్న టీడీపీ పార్టీ కి ఇప్పుడు ఎవరి సహకారం లేక వెనకబడి ఉందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అంతేకాదు ఇందుకు కారణం కూడా వారు వెల్లడిస్తున్నారు.. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు పార్టీ కి చాలామందిని దూరం చేస్తుందని అంటున్నారు. ఇటీవలే చంద్రబాబు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే..

అయితే ఈ నియామకంలో నియమించిన లీడర్లను చూసుకుంటే చాలాచోట్ల కొత్త మొహాలు, అవుట్ డేటెడ్ నేతలను ప్రోత్సహించడంతో ఫైర్ ఉన్న నాయకులను దూరం చేశారని టీడీపీ తమ్ముళ్లు చంద్రబాబు పై అసహనంగా ఉన్నారట.. ముఖ్యంగా  విజ‌య‌వాడ పార్లమెంట‌రీ జిల్లా నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ఔట్ డేటెడ్ నాయ‌కుడు, మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురామ్ కు చంద్రబాబు బాధ్యత‌లు అప్పగించడం అక్కడి నేతలెవరికి పొసగడం లేదట.. బెజ‌వాడ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో మైల‌వ‌రం, నందిగామ‌, జ‌గ్గయ్యపేట నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కులు నెట్టెం ర‌ఘురామ్ తో అస్సలు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం లేదు అంటున్నారు..

ఇక ఈయన నియామకం తో టీడీపీ లోని పెద్ద పెద్ద లీడర్లంతా చంద్రబాబు పై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.. గెలిచినా, పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలిపెట్టి రాజకీయాలకు పూర్తి గా దూరమైన రఘురాం కి ఇంచార్జ్ చేసి చంద్రబాబు అందరికి అన్యాయం చేశారని వారి ఆవేదన.. ముఖ్యంగా జ‌గ్గయ్య పేట‌లో రెండు సార్లు గెలిచినా శ్రీరాంతాత‌య్య కొంత ఆవేశంగా ఉన్నారట.. ఇక్కడ 1999, 2004 ఎన్నిక‌ల్లో నెట్టెం ర‌ఘురామ్ ఓడిపోగా 2009లో ఆయ‌న స్వచ్ఛందంగా త‌ప్పుకున్నారు. మ‌ధ్యలో తాత‌య్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పట‌కీ నెట్టెం ర‌ఘురామ్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తో తాత‌య్య సైతం అసహ‌నంతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న కూడా నెట్టెం ర‌ఘురామ్ దారిలో న‌డ‌వ‌డం క‌ష్టమేన‌ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడ లో పార్టీ ఎలా పుంజుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: