భారత్లో కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగి పోతున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా కంట్రోల్ కావడం లేదు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అని భావించిన కేంద్ర ప్రభుత్వం క్రమక్రమంగా అన్లాక్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ దేశంలో అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా కరోనా వైరస్ తో సహజీవనం చేస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.



 ప్రభుత్వం అన్లాక్ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎంతో మంది ప్రజలు రోడ్ల మీద తిరుగుతూ ఉండటం... కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా మాస్క్  పెట్టుకోకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించడం ద్వారా రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. అయితే ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు వెలుగులోకి వస్తున్న రికార్డు స్థాయి కరోనా కేసులు నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ రేంజ్ లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతాయి అనేదానిపై నిపుణులు అంచనాలు ప్రస్తుతం అందరిలో ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే.



 కాగా 2021 ఫిబ్రవరి నాటికి దేశంలో సగం జనాభాకు కరోనా వైరస్ సోకుతుంది అని  ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర  అగర్వాల్  తెలిపారు. ఇది వైరస్ వ్యాప్తిని నెమ్మదించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశ జనాభాలో 30 శాతం మందికి కరోనా వైరస్ సోకింది గణిత నమూనా ప్రకారం చేసిన అధ్యయనంలో వెల్లడించారు ప్రొఫెసర్ మనీంద్ర  అగర్వాల్. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మాస్కులు ధరించకపోయినా భౌతిక దూరం పాటించకపోవడం చేస్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: