ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని జగన్ ఇప్పటికే వెలికి తీసే ప్రయత్నంలో జగన్ ఉన్నారు.. ఆ క్రమంలోనే కొంతమంది ఎలుకల్ని జైలుకి పంపాడు.. వారు కూడా అవినీతి ఆరోపణల్లో నిజం నిర్ధారణ అవడంతో సైలెంట్ గా ఉండక తప్పట్లేదు.. ప్రతిపక్ష పార్టీ లో అవినీతికి పాల్పడ్డ వారిపై జులుం విప్పుతూ వారిని జైలుకి పంపిస్తూ ప్రజలకు అవినీతి లేని సామ్రాజ్యాన్ని సృష్టించే పనిలో ఉన్న జగన్ కు సొంత పార్టీ నేత అవినీతి కోరల్లో చిక్కుకోవడం ఇప్పుడు సమస్యగా మారింది.. అయితే ఇప్పటివరకు ఇవి ఆరోపణలే అయినా రుజువైతే ఏంటి పరిస్థితి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇక అమరావతి లో జరిగిన కుంభ కోణాల సంగతి అందరికి తెలిసిందే.. అక్కడి ప్రజలను మభ్యపెట్టి టీడీపీ భు కుంభకోణాలు జరిపిందని జగన్ విచారణ చేపిస్తుండగా దాన్ని అడ్డుకుని చంద్రబాబు అక్కడ తాము స్కాం లు చేశామని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు.. దాంతో ప్రజలు చంద్రబాబు ను నమ్మడం మానేశారు.. ఎంతో కొంత నిజం లేకపోతే జగన్ విచారణ ను అడ్డుకుంటాడు బాబు అని ప్రజలు ఆలోచిస్తున్నారు.. ఇక ఉద్యమానికి ప్రజల  ఆదరణ లేకపోవడంతో క్రమంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం క్రమంగా చల్లారిపోయినట్టుగానే భావించాలి.

సరిగ్గా అదే సమయంలో మూడు రాజధానులకు అనుకూలంగా కొందరు రోడ్డెక్కడం ఆసక్తిగా కనిపిస్తోంది. పాలనా వికేంద్రీకరణకు అనూహ్యంగా అమరావతిలోనే మద్ధతు లభిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా అంటూ అమరావతిలో ఆందోళనకు పూనుకోవడం ఆశ్చర్యంగా మారింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు జంక్షన్ వద్ద మూడు రోజులుగా రాజధాని గ్రామాల రైతులు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా సాగుతున్న ఈ దీక్షల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. దళిత బహుజన పరిరక్షణ సమితి పేరుతో ఈ కార్యక్రమం సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: