ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు కునుకు లేకుండా చేస్తోంది ఎవరు..? అగ్రరాజ్యంతోనే పేచీలు పెట్టుకునే కిమ్‌ను.. అంతలా వణికిస్తుందెవరు? దీనిపై అమెరికా పరిశోధన సంస్థలు ఏం చెబుతున్నాయి.

కిమ్.. కరుడు గట్టిన నియంత. ఆయన మాట కాదంటే.. కాల్చిపడేస్తారు. పేదరికంలో మగ్గుతున్నా... ఆకలితో అలమటిస్తున్నా ఆయన విధించే కఠిన నిబంధనలు పాటించి తీరాలి. అలాంటి కిమ్‌కు కునుకు లేకుండా చేస్తోంది  కరోనా వైరస్...ఎవరైనా సరిహద్దుగుండా లోనికి ప్రవేశిస్తున్నా... దేశం విడిచిపోతున్నా కాల్చి పడేయాలని ఆదేశాలు జారీ చేశారు కిమ్.. దేశంలోని విదేశీయులను క్వారంటైన్‌కు తరలించారు. దౌత్యవేత్తలు, రాయభారులను ఇంటికే పరిమితం చేశారు. ప్రజలపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన కిమ్‌ ... వాటిని మరింత కఠినం చేస్తూ ఆదేశాలిచ్చారు.

కిమ్ కరోనాకు అంతగా భయపడడానికి కారణం ఉంది. ఉత్తర కొరియాలో దశాబ్దాలుగా వైద్యరంగం కుప్పకూలిపోయింది. దీంతో తమ వైద్యులు.. కరోనాతో పోరు చేయడం అసాధ్యమని గ్రహించిన కిమ్.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.ఇప్పటికే ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్న ఉత్తరకొరియా.. కరోనా సంక్షోభాన్ని అధిగమించడం ఆసాధ్యమేనని కిమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. కిమ్ సహా ఆయన కుటుంబసభ్యులు కరోనా టీకా వేయించుకున్నారని వాషింగ్టన్‌లోని సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఇంట్రెస్ట్‌ అనే సంస్థ తెలిపింది. చైనాలో అభివృద్ధి చేస్తున్న టీకాను తీసుకున్నట్లు ఈ సంస్థ చెబుతోంది.

మరోవైపు.. ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా రాలేదని అక్కడి అధికారులు చెప్పడాన్ని అమెరికా నిఘా సంస్థలు తోసిపుచ్చాయి. అక్కడి ప్రజలు చైనీయులతో నేరుగా వ్యాపారాలు నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా అక్కడికి  రాకుండా ఉండే అవకాశాలు దాదాపు అసాధ్యమని చెబుతున్నాయి.

మొత్తానికి కిమ్ కు కరోనా టెన్షన్ పట్టుకుంది. సరిహద్దుల్లో తమ దేశంలోకి ఎవరైనా ప్రవేశిస్తున్నా.. వెళుతున్నా కాల్చిపారేయండని ఆదేశాలు జారీచేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వైద్య రంగం కుప్పకూలింది. ఆర్థిక సమస్యలతో విలవిలలాడిపోతోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: