గత ఆరు నెలల్లో ఇలాంటి మోసాలు బాగా పెరిగాయి. మొదట్లో దుండగులు ఫేస్బుక్ ఖాతాల ను హ్యాక్ చేసి, వారి స్నేహుతుల ను డబ్బు అడిగేవారు. అన్ని సందర్భాల్లో ఇది ఫలితాల ను ఇవ్వకపోవడం తో వారి ఫోటోలు, ఇతర వ్యక్తిగత వివరాల ను ఉపయోగించి ప్రజా కార్య క్రమాల పేరిట డబ్బు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వారు సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల అకౌంట్లను క్లీన్ చేశారు .
డబ్బులు కావాలని పోస్టులు పెడతారు. ఈ విషయాలు తెలియక స్పందించిన వారు మోస పోతున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఫేస్బుక్కు మాత్రమే పరిమితం కాలేదు. గతం లో వాట్సాప్, ఓఎల్ఎక్స్ ద్వారా సైబర్ నేరస్థుల చేతిలో ప్రజలు మోసపోయినట్లు అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మళ్ళి స్టైల్ మార్చారు. సీజనల్ వ్యాపారాల్లాగా, సీజనల్ మోసాల కు పాల్పడుతున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ట్రెండింగ్ లో ఉండటంతో జనాన్ని ఈజీగా నమ్మించేలా ప్లాన్ చేశారు. టీకా రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. కరోనా టీకా కోసం ఫోన్లో ఆధార్, ఓటీపీ నెంబర్లు అడుగుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ఏపీ పోలీసులు ఇలాంటి వారిని అసలు నమ్మొద్దని సూచించారు.కరోనా వ్యాక్సిన్ పేరుతో ఎవరైనా ఓటీపీలు, ఆధార్ నెంబర్ అడిగితే ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి