అమెరికా చరిత్రలో ఎందరో ప్రెసిడెంట్‌లు ఉన్నారు. ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇన్నాళ్లు తిక్క పనులతో చిర్రెత్తిన అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు చీదరింపులు, అవమానాలతో వైట్‌ హౌస్‌ వదిలేందుకు రెడీ అవుతున్నారు. అయితే ట్రంప్‌ కంటే ముందే ఇద్దరు అధ్యక్షులు అభిశంసనను ఎదుర్కొన్నారు.

అమెరికా చరిత్రలో తొలిసారి అభిశంసన ఎదుర్కొన్న అద్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌. 1868లో ఆయనపై అభిశంసన విధించారు. ఆయన్ను గద్దె దించడమే లక్ష్యంగా ఇబ్బందులకు గురి చేశారు రిపబ్లికన్లు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. ఆయనపై పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాథమిక అభియోగంపై సభ 11 అభిశంసన పత్రాలను ఆమోదించింది. అయితే ఆండ్రూ జాన్సన్‌ సెనేట్‌లో ఒక్క ఓటుతో గట్టెక్కారు. మూడింట రెండొంతుల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ కావడంతో ఆయన గట్టెక్కారు. అయితే తర్వాత కూడా పాలన అంత సాఫీగా సాగలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో జాన్సన్‌ ఓడిపోయారు.

అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కొన్న రెండో అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌. ఇంతకు ముందు అధ్యక్షులపై అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు ఆరోపణలు వస్తే.. బిల్‌ క్లింటన్‌పై మాత్రం.. లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మోనికా లెవెన్‌స్కీ స్కాండల్‌లో బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు.

ఇదిగో ఇప్పుడు ట్రంప్‌ వంతు. అయితే ఒక్కసారి కాదు ట్రంప్‌ ఏకంగా రెండు సార్లు ఎదుర్కొన్నాడు. 2019లో ట్రంప్‌ మొదటిసారి అభిశంసనను ఎదుర్కొన్నారు. బిడెన్‌ తనయుడి వ్యాపారాలపై విచారణకు ఆదేశించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకొచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు 2016 ఎన్నికల్లో రష్యా హస్తం ఉందంటూ అవాస్తవాలు ప్రచారం చేశారన్న దానిపైనా ఆయనపై అభిశంసన ఎదుర్కొన్నారు. అయతే ఈ అభిశంసన తీర్మానంపై నెలల పాటు విచారణ జరిగింది. ఇంటెలిజెన్స్‌ కమిటీ 300 పేజీలకు పైగా నివేదిక ఇచ్చింది. అయితే ప్రతినిధుల సభ అభిశంసనను ఆమోదించినప్పటికీ.. సెనేట్‌ మాత్రం సరైన ఆధారాలు లేవంటూ తోసిపుచ్చింది. దీంతో అప్పుడు బయటపడ్డ ట్రంప్‌.. ఇప్పుడు మరోసారి అభిశంసనను ఎదుర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: