అసలు బ్రాహ్మణులంటే ఎవరు? నిజానికి శూద్రునికి పుట్టిన పుత్రుడు శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడికి పుట్టిన పుత్రుడు మాత్రం ఎప్పటికీ బ్రాహ్మణుడు కాలేడు అని అంటోంది ధర్మ శాస్త్రం. అంతేకాక బ్రాహ్మణుడిని ద్విజుడు అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుంచి జరిగితే, ఇక రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుందని వేదాలు, పురాణాలు తోపాటు ధర్మ శాస్త్రం కూడా చెబుతోంది. జన్మ వల్ల సోద్రత్వం లభిస్తే, కర్మ వల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదు.. బ్రాహ్మణుడిగా జీవించడం గొప్ప. ముందుగా బ్రాహ్మణులు అనేమాట బ్రాహ్మణ్ అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. అసలు బ్రాహ్మణ్ అంటే యజ్ఞం అని అర్థం. ఇక యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులు అని చెప్పుకోవచ్చు. బ్రహ్మ అంటే జ్ఞానం, వేదం అని వీటినుండి బ్రాహ్మణ అనే శబ్దం పుట్టుకొచ్చింది అని కూడా చెప్పవచ్చు. వేదాధ్యయనం చేసిన వాడు బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు.
ద్వాపరయుగంలో మరుత్తరాట్ చక్రవర్తి చేసినటువంటి యజ్ఞంలో వారికి దక్షణగా యజ్ఞం చేయడం ద్వారా వారికి అపూర్వమైన ధనరాశి వస్తే, వారికి అవసరమైన ధనాన్ని మాత్రమే వారు తీసుకుని, "ఇంకా కోటాను కోట్ల ధనరాశి మన వద్ద ఉంది. దీనిని అలాగే మన వద్ద ఉంచుకుంటే మన వంశపార తదనంతరం మన పిల్లలకు ఇస్తే,పిల్లలు సంధ్యాకాలం పూజలు చేయరు.. వేదాలు పఠనం చేయరు, విలాసవంతమైన జీవనానికి మోహితులవుతారు, ఇలా చేయడం వల్ల బ్రాహ్మణ కులం అంతరించిపోతుంది. హీనత్వం పొందుతుంది అనే ఆలోచనతో వారికి అవసరమైన ధనాన్ని మాత్రమే తీసుకొని, ఆ బ్రాహ్మణులు హిమాలయాల్లో ఎవరికి తెలియని ఒక రహస్య ప్రదేశంలో దాచి పెట్టారు".
ఇక ఆ తరువాత ధర్మరాజు కౌరవ సామ్రాజ్యాన్ని మొత్తం జయించిన తర్వాత, ఇక వందమంది కౌరవుల దహన సంస్కారాలు పూర్తి చేసేటప్పటికి పాండవులు సంపాదించిన ధనరాసులు మొత్తం అయిపోయాయి. ఇంతటి విపత్కర సమయంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని ప్రయత్నిస్తుంటే, ఇక ఆ యాగం కూడా చేయడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో, వ్యాసమహర్షి వచ్చి హిమాలయాల్లో బ్రాహ్మణుల దాచిపెట్టిన ధనం గురించి వివరిస్తాడు. ఇక ధర్మరాజు ధర్మబద్ధంగా బ్రాహ్మణుల సొమ్మును తీసుకోకూడదు,ఆ ధనాన్ని తీసుకోవడానికి వెనకాడతారు. ఇక వ్యాసమహర్షి ఆ ధనం బ్రాహ్మణులు వద్దనుకుని,అక్కడ దాచిపెట్టారు నీవు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని చెప్తాడు. అలా బ్రాహ్మణ ద్రవ్యం ఒక రాజుకు ఉపయోగపడింది. ఇంతటి మహా గొప్ప చరిత్ర కలిగిన వాడు బ్రాహ్మణుడు.
కానీ ఆనాటి కాలంలో ఒక రాజుకి దానంగా బ్రాహ్మణుడు ధనాన్ని ఇస్తే, ఇక ప్రస్తుత కాలంలో ఆ బ్రాహ్మణుడు ధనం కోసం మరి ఒకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడింది. బ్రాహ్మణులకు దేవాలయాల్లోనూ, రాజకీయ పార్టీల లోనూ, అసలు ఏ రంగంలోనూ వారికి ప్రోత్సాహం కలగడం లేదు. బ్రాహ్మణులు ముఖ్యంగా దేవాలయాల్లో అర్చనలు చేసేవారు. అలాంటి వారికి, వారు చేస్తున్న వృత్తిలోనూ సరైన వేతనం లభించక మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన ప్రభుత్వాలు బ్రాహ్మణులను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలలో కూడా బీ సీ, ఎస్టీ,ఎస్సీ అని వారికి అన్ని రంగాలలోను పట్టం కడుతూ ఉంటే, ఇక బ్రాహ్మణులకు చోటు ఎక్కడుంది. ఇక బ్రాహ్మణ యువతకు ఏ రంగంలోనూ అభివృద్ధి లేక వారు చాలా దీనస్థితికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బ్రాహ్మణుల గురించి, వారు పడుతున్న బాధల గురించి కూడా ఆలోచించి, వారికి అన్ని రంగాలలోనూ స్థానం కల్పించి, వారికి చేయూతనివ్వాలని మన వంతు ప్రయత్నంగా కోరుకుందాం.
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి