ఇక వివిధ దేశాలు సహాయం అందించడంతో కరోనా వైరస్ ను కాస్త నియంత్రించగలిగింది పాకిస్తాన్. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ కనీసం ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ కొనుక్కోలేని స్థితిలో ఉంది. అదే సమయంలో ప్రపంచ దేశాలలో ఉగ్రవాదులతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే పాకిస్తాన్ కు వ్యాక్సిన్లు బహుమతిగా అందించేందుకు కూడా ఏ దేశం ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే తన మిత్ర దేశమైన చైనా ముందుకు వచ్చింది.
ఇటీవలే పాకిస్తాన్ కు చైనా ఆపన్నహస్తం అందించింది. చైనా నుంచి 5 లక్షల డోసుల వ్యాక్సిన్ పాకిస్తాన్కు అందించింది. ఈ మేరకు సినోఫార్మ్ వాక్సిన్ను చైనా నుంచి తమ దేశం స్వీకరించినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. అదే సమయంలో తమ దేశం నుంచి వ్యాక్సిన్ పొందిన మొదటి దేశంగా పాక్ నిలిచింది అని.. ఇది తమ మధ్య ఉన్న నిజమైన మైత్రికి నిదర్శనంగా భావిస్తున్నట్లు చైనా చెప్పుకొచ్చింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ చేసిన వ్యాక్సిన్ ద్వారా ఎన్నో సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని మిగతా దేశాలు చైనా వ్యాక్సిన్ ను నిషేధించాయి. మరి ఇప్పుడు పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి