ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఎన్నికల కమీషన్ ని దృష్టిలో పెట్టుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక తాజాగా మంత్రి కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమీషన్ సీరియస్ అయింది. అధికారంలో ఉన్న పార్టీ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అని ఎన్నికల కమీషన్ పేర్కొంది. అయితే మంత్రిగా ఉన్న‌కొడాలి నాని మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ ప్రతిపత్తిని అగౌరవపరిచేలా ఉన్నాయి అని ఎన్నికల కమీషన్ ఆక్షేపించింది. సాధారణంగా పంచాయితీ ఎన్నికలు జరిగేటప్పుడు ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ ను నిందిస్తాయి అని అన్నారు. 

క్షేత్రస్ధాయిలో ఎన్నికల కోడ్ అమలవడం ద్వారా అందరికీ సమాన అవాకాశాలు ఉండేలా కమిషన్ చూస్తుంది అని తెలిపింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన వ్యక్తి మరో రాజ్యాంగ సంస్ధపై ఈ విధంగా దాడి చేయడం సమంజసం కాదు అని అభిప్రాయపడింది. గతంలో కూడా‌ మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ పై నోటి దురుసును ప్రదర్శించిన సంయమనం పాటించాం అని ఎన్నికల కమీషన్ పేర్కొంది. గతంలో ఆయన ఎన్నికల కమిషన్ పై చేసిన దూషణ లకు సంబంధించి పేపర్ కటింగ్స్ జత చేస్తున్నాం అని ఎన్నికల కమీషన్ పేర్కొంది. 

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం..ఆధారాలు సమర్పించాం అని వివరించింది. ఎన్నికల కమిషనర్ ను ప్రతిపక్ష నేతను కుట్రదారులుగా అభివర్ణించారు అని ఎన్నికల కమీషన్ పేర్కొంది. ఇక కొడాలి నానిపై ఎస్ ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు ఇచ్చింది. ప్రెస్ మీట్ లతో పాటు ఎలాంటి మీటింగ్ లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్,ఎస్పీలను కొడాలి నానిపై పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కొడాలి నాని ఇచ్చిన షో కాజ్ వివరణ పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం.

మరింత సమాచారం తెలుసుకోండి: