ఏపి లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో కీలకంగా మారాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాక ముందే టీడీపీ , వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. చిత్తూరులో మాత్రం ఘర్షణలు తారా స్తాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన వ్యక్తికి ప్రతిపాదించానన్న అక్కసుతో తనపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి,పళ్లు ఊడగొట్టారని తిరుపతికి చెందిన తెదేపా కార్యకర్త గోళ్ల లోకేష్‌నాయుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి కార్పొరేషన్‌లోని ఆరు డివిజన్లలో నామినేషన్లను స్వీకరించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని 45వ డివిజన్‌ నుంచి చంద్రమోహన్‌ అనే వ్యక్తి తెదేపా తరఫున నామినేషన్‌ దాఖలు చేయగా, ఆయన అభ్యర్థిత్వాన్ని లోకేష్‌నాయుడు ప్రతిపాదించారు.


నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని వైసీపీ వర్గీయులు అతని పై ఒత్తిడిని తీసుకొచ్చారని ఆయన అన్నారు.చంద్రమోహన్‌ నామినేషన్‌ దాఖలు చేయగా తాను ప్రతిపాదిస్తూ సంతకం చేశానన్నారు. సాయంత్రం చంద్రమోహన్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశం పార్కు పక్కనే ఉన్న తన దుకాణాన్ని వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారని, పారిపోతున్న కూడా వారు వదల్లేదు. గుండాలుగా ప్రవర్తించారని లోకేశ్ నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తనపై దాడి చేయడంతో రెండు పళ్లు ఊడిపోయాయని చూపించారు. భయంతో పరుగున అలిపిరి పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఆయన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. దాడి ఘటన తెలుసుకున్న తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కాగా 47వ వార్డు టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శి సురేంద్ర తప్పిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు అలిపిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరో వైపు పుంగనూరు లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనపడింది.. టీడీపీ తరపున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ విషయం పై టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా ,పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వైసీపీ గుండాలు దౌర్జన్యం చేస్తే టీడీపీ ఎన్నికల్లో కూడా నిలబడడానకి కూడా ముందుకు రారని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: