అసలే రాష్త్రం క్లిష్ట పరిస్థితులలో ఉంది, ఇది కేవలం నుతన్ ప్రసాద్ సినిమా డైలాగ్ కాదు. నిజంగా మన రాష్ట్రంలోని పరిస్థితికి అడ్డంపడుతుంది ఈ డైలాగ్.
రాష్త్రంలో సమస్యలన్నవి అస్సలు లేనట్టు మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం కట్టారు, బొత్స గారు కూతురి పెళ్లిలో బిజీ. కోస్తా జిల్లాలు, కొన్ని తెలంగాణ జిల్లాలు నీలం ప్రభావంతో అతలాకుతలం అయితే ఎక్కడా మన నాయకులు కనిపించట్లేదు. తెలంగాణా విషయంలో మాత్రం ఓవర్ యాక్షన్ చేసే లగడపాటి ఎక్కడున్నారో మరి. కావూరి, రాయపాటి ఎవ్వరి పైరవీల్లో వారు బిజీ. రఘువీర మీడియా ముందుకు వచ్చి కాస్త అయిన మాట్లాడుతున్నారు గాక , మిగిలిన మంత్రులు ఏమయ్యారో మరి, ప్రజల వద్దకు కేవలం ఇందిరమ్మ బాట ద్వారా తప్పితే వేరే బాటనే లేదేమో కిరణ్ గారికి.
ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని జీవితంలో చూడలేదని ఆంధ్ర ప్రదేశ్ జనం అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి