ఈ క్రమంలోనే విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవడం ఇక ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడటం లాంటివి చేస్తూ ఉన్నారు అనే విషయం తెలిసిందే. అయితే.. కొన్ని పాఠశాలల్లో మాత్రం దీనికి అంతా విరుద్ధంగా ఉంది నిబంధనలు పాటించడం కాదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏకంగా విద్యార్థులతో అన్ని పనులు చేపిస్తున్నారు. ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట రాంపురం సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో.
సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇటీవలే టాయిలెట్లు శుభ్రం చేస్తూ ఉండటం వివాదాస్పదంగా మారిపోయింది. మామూలు సమయంలో విద్యార్థులు ఎలా ఉన్నప్పటికీ ఇక ప్రస్తుతం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా విద్యార్థులను చేసుకోవాల్సిన వారు ఏకంగా విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ ఉండడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఏకంగా ఈ పాఠశాలలో 560 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఓ వైపు పాఠశాలల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉంటే ఇలా పాఠశాల విద్యార్థులతో టాయిలెట్ క్లీన్ చేయించడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి