ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ కొనుగోలు చేస్తే కేవలం మొబైల్ మాత్రమే.. కాదు మొబైల్ తో పాటు చార్జర్ హెడ్ ఫోన్స్ కూడా వచ్చేవి. ఈ క్రమంలోనే ఇక మొబైల్ కొనుగోలు చేసిన తర్వాత మొబైల్ కు సంబంధించిన ఇతర వస్తువులను మళ్లీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయేది. దీంతో అటు మొబైల్ కొనుగోలుదారులు అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుండేది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎన్నో మొబైల్ కంపెనీలు.. ఇక కొనుగోలుదారులకు కేవలం మొబైల్స్ మాత్రమే ఇస్తున్నాయి. కొన్ని మొబైల్ కంపెనీలు ఇప్పటికే హెడ్ ఫోన్స్ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే.
ఇక హెడ్ ఫోన్స్ ఇవ్వక పోయినప్పటికీ అటు మొబైల్ ప్రియులు మాత్రం కాస్త సర్దుకుపోతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా మొబైల్ తో పాటు చార్జర్ కూడా ఇవ్వడాన్ని ఆపేస్తున్నాయి కొన్ని రకాల మొబైల్ తయారీ కంపెనీలు. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 12కు చార్జర్ ఇవ్వడం ఆపేసింది. పర్యావరణం కోసం ఈ పని చేస్తున్నట్లు యాపిల్ సంస్థ చెబుతున్నప్పటికి అటు మొబైల్ చార్జర్ రాకపోవడం మొబైల్ ప్రియులను నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి వినియోగదారుల ఫోరం కి ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో ఏకంగా రెండు మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 15 కోట్ల ఫైన్ యాపిల్ కంపెనీకి విధించింది వినియోగదారుల ఫోరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి