ఈ క్రమంలోనే ఇక రోడ్డు ఈ పనులు పాటించని వాహనదారులపై కొరడా జరిపించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా వాహనదారుడు బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఇక ఫోన్ వచ్చింది అంటే చాలు పక్కకి బైక్ ఆపుకోకుండా అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
ఇకనుంచి ఒకవేళ వాహనదారులు ఎవరైనా సరే బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడితే ఇక కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ నేరం రుజువైతే భారీ జరిమానా తో పాటు మూడు నెలల జైలు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. అయితే ఇలా మొబైల్ మాట్లాడుతూ బైక్ నడిపితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది కోర్టుకు సమర్పిస్తాము అంటూ తెలిపారు. అయితే నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఫోన్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి సరికొత్త అమలులోకి తీసుకు రావడం వల్ల ఇక రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి